https://oktelugu.com/

Star Hero: అప్పట్లో కండోమ్స్ పట్టుకొని ఇవి వాడండి అని చెప్పాను.. స్టార్ హీరో సంచలన కామెంట్స్…

Star Hero: రీసెంట్ గా భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన క్యూ అండ్ ఏ ని నిర్వహించారు. ఇక అందులో భాగంగానే సిద్ధార్థ్ తన సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పాల్సి వచ్చింది. నిజానికి అందులో ఉన్న ఒక రిపోర్టర్ కమలహాసన్ ను ఉద్దేశించి మీరు భారతీయుడు 2 సినిమా చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 8, 2024 / 05:46 PM IST

    Siddharth on Drugs awareness campaign

    Follow us on

    Star Hero: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని ఉద్దేశించి వాళ్ళు సినిమాలు తీయడమే కాకుండా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్లు స్వతహాగా స్పందించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తూనే జనాన్ని కూడా మోటివేట్ చేయాలి. అప్పుడే వాళ్లకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉందని తెలుస్తుంది.ఇక దాంతో పాటుగా హీరోలను అభిమానించే ప్రేక్షకులు కూడా అలాంటి కార్యక్రమాలను చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది.

    ఇక రీసెంట్ గా భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన క్యూ అండ్ ఏ ని నిర్వహించారు. ఇక అందులో భాగంగానే సిద్ధార్థ్ తన సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పాల్సి వచ్చింది. నిజానికి అందులో ఉన్న ఒక రిపోర్టర్ కమలహాసన్ ను ఉద్దేశించి మీరు భారతీయుడు 2 సినిమా చేశారు. ఇప్పుడు తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ పెంచాలంటే సీఎం అయిన రేవంత్ రెడ్డి నటినటులతో సమాజానికి ఉపయోగపడే కొన్ని వీడియోలను చేయిస్తున్నారు. టికెట్ రేట్ పెంచాలంటే తప్పకుండా ఇది చేయాలనే కండిషన్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది.

    మరి మీరు ఎలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ని పాటిస్తారు. ఆయన చెప్పిన విధానాలకు కట్టుబడి ఉంటారా లేదా అని ప్రశ్న అడగగానే వెంటనే సిద్ధార్థ్ మైక్ తీసుకొని నా పేరు సిద్ధార్థ్ నేను 2005 వ సంవత్సరం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నాను. దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. నేను నా మొదటి సినిమా చేసినప్పుడే కండోమ్స్ వాడండి అంటూ ఒక యాడ్ చేశాను. అప్పట్లో మీరు సిటీ లో ఎక్కడ చూసిన పెద్ద పెద్ద హోడింగ్స్ లో నా ఫోటో ఉండేది.

    కండోమ్స్ పట్టుకొని ఇది వాడండి అంటూ చెప్పిన నా ఫోటో మీకు కనిపించేది. అదంతా సోషల్ రెస్పాన్సిబిలిటీ తోనే చేశాను. నిజానికి నాకనే కాదు ప్రతి ఒక్క ఆర్టిస్టు కి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడగడం కూడా వేస్ట్ అన్నట్టుగా సిద్ధార్థ్ సమాధానం ఇచ్చాడు…