Shankar: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు మణిరత్నం, శంకర్ సినిమాల హవా ఎక్కువగా నడిచేది. వీరిద్దరూ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసి వరుస సక్సెస్ లను అందుకునేవారు. ఇక శంకర్ అయితే భారీ గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలు చేయడంలో దిట్ట అనే చెప్పాలి. ఇప్పుడు చాలా మంది దర్శకులు గ్రాఫిక్స్ సినిమాలు చేస్తున్నారు. కానీ శంకర్ ఒక 20 సంవత్సరాల క్రితమే గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలను చేసి అద్భుతమైన రెస్పాన్స్ ని కూడా అందుకున్నాడు.
ఇక ఒకానొక సమయంలో ఆయనకు ఫెయిల్యూర్ అనేది కూడా లేకుండా వరుస సక్సెస్ లను సాధించాడు. ఇక ఇదిలా ఉంటే శంకర్ ప్రస్తుతం కొంచెం డల్ అవ్వడానికి ఆయన సినిమాలు అంత ఎఫెక్ట్ గా ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన కథల విషయంలో చాలా వరకు వెనుకబడి పోతున్నారు. అందువల్లే ఆయన సినిమాలు బాగున్నప్పటికి కథపరంగా మాత్రం ప్రేక్షకుడిని సాటిస్పై చేయడం లేదు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే రోబో సినిమా వరకు శంకర్ టీం లో సుజాత అనే ఒక రైటర్ ఉండేవాడు. ప్రతి సినిమాకు సంబంధించిన మేజర్ కథ మొత్తాన్ని ఆయనే రెడీ చేసేవాడు.
దానివల్ల సినిమా కథ మీద ఆయనకు చాలా పట్టు ఉండడం వల్ల కథ చాలా ఎఫెక్టుగా వచ్చేది. కానీ రోబో తర్వాత ఆయన మరణించాడు. ఇక అప్పటి నుంచి శంకర్ కథను రాసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి అప్పటి నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. నిజానికి శంకర్ సినిమాల్లో ఆయన లేని లోటు అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన స్టోరీ డిష్కషన్ లో ఎంతమంది టీం ను కూర్చున్న కూడా ఆ సినిమాలు అంత ఎఫెక్టివ్ గా రావడం లేదు.
ఇక ఇదే విషయాన్ని రీసెంట్ గా శంకర్ కూడా ప్రస్తావిస్తూ ఆయన లేని లోటు ఉంది. కానీ ఆ లోటును భర్తీ చేయడానికి మరి కొంతమంది స్టార్ రైటర్స్ ను కూడా టీమ్ లో పెట్టుకున్నట్టుగా చెప్పాడు…ఇక మీదట వచ్చే సినిమాలా కథ విషయం లో అయిన ఆయన జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి…