Cell phone : పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారో చెక్ చేయండి.. గమనించకపోతే పిల్లల ఫ్యూచర్ ఫినీష్

Cell phone ఇంట్లో పిల్లలు రీల్స్ చూస్తున్నారు? చేస్తున్నారు అని అలాగే వదిలేయకండి. సినిమాలు చూస్తే పాటలు వింటూ పాఠాలు కూడా నేర్చుకుంటున్నారు అని మాత్రమే అనుకోకండి. వారికి ఫోన్ ఇచ్చే సమయంలో మీరు అలర్ట్ గా ఉండాల్సిందే. చుట్టూ ఉన్న స్నేహితులు, చుట్టాలను కూడా పట్టించుకోకుండా ఫోన్ లోనే ఉంటున్నారు. అయితే మీరు కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉంటే మాత్రం మీ పిల్లల విషయంలో డేంజర్ బెల్స్ మోగుతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ తో అంటూ పిల్లలతో చాటింగ్ చేస్తున్నారా?

Written By: NARESH, Updated On : July 8, 2024 5:43 pm

childrens

Follow us on

Cell phone : ఫోన్ ఫోన్ ఫోన్ ఎవరి చేతిలో చూసినా సరే ఫోన్ కనిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. ఒకప్పుడు కేవలం కొందరి ఇంట్లో మాత్రమే ఫోన్ ఉండేది. తర్వాత కాయిన్ బాక్స్ లు వచ్చాయి. ఈ కాయిన్ బాక్స్ ల తర్వాత అందరి ఇంట్లో చిన్న ఫోన్ లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా అందరి చేతిలోకి ఒక ఫోన్ వచ్చేసింది. దీంతో అవసరమైన దానికంటే అనవసరమైన వాటికే ఎక్కువ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. మరి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే..

ఇంట్లో పిల్లలు రీల్స్ చూస్తున్నారు? చేస్తున్నారు అని అలాగే వదిలేయకండి. సినిమాలు చూస్తే పాటలు వింటూ పాఠాలు కూడా నేర్చుకుంటున్నారు అని మాత్రమే అనుకోకండి. వారికి ఫోన్ ఇచ్చే సమయంలో మీరు అలర్ట్ గా ఉండాల్సిందే. చుట్టూ ఉన్న స్నేహితులు, చుట్టాలను కూడా పట్టించుకోకుండా ఫోన్ లోనే ఉంటున్నారు. అయితే మీరు కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉంటే మాత్రం మీ పిల్లల విషయంలో డేంజర్ బెల్స్ మోగుతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ తో అంటూ పిల్లలతో చాటింగ్ చేస్తున్నారా?

ఆ స్నేహితులు కూడా ఎవరో ఓ కన్ను వేసి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ మాఫియా బయలుదేరిందట. 9వ తరగతి దాటిన పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. పిల్లలు ఎదుగుతున్న కొద్ది వారికి చెడు దారులు సైతం అలవాట్లు అవుతాయి.

మంచి చెడు మధ్య తేడా తెలియని వారిని డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తోందట. అందుకే ఎవరితో చాట్ చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండటం తల్లిదండ్రుల బాధ్యతనే ఒక్కసారి డ్రగ్స్ కు అలవాటు పడితే వారిని కంట్రోల్ చేయడం కష్టమే. సో జాగ్రత్త.