https://oktelugu.com/

Hyper Aadi: పవన్ కళ్యాణ్ పక్కన అలా కూర్చుని షాక్ ఇచ్చిన ‘హైపర్ ఆది’

Hyper Aadi:  జబర్దస్త్ అంటేనే కామెడీ ప్రపంచం.. ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టి తక్కువ టైంలోనే తనదైన నవ్వులతో ‘హైపర్ ఆది’గా బాగా ఫేమస్ అయ్యాడు యాదయ్య అలియాస్ ‘హైపర్ ఆది’. సినిమాల్లోనూ నిలదొక్కుకొని లక్షల తీసుకొనే నటుడిగా కూడా ఎదిగాడు. పైగా ఆది స్కిట్ల కోసమే జబర్ధస్త్‌ ను చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువమంది ఉన్నారు. ఆ స్థాయిలో ఆది హవా కొనసాగుతుంది. అందుకే.. సినిమాల్లో కూడా ఆదికి ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. అయితే, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 15, 2022 / 10:44 AM IST
    Follow us on

    Hyper Aadi:  జబర్దస్త్ అంటేనే కామెడీ ప్రపంచం.. ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టి తక్కువ టైంలోనే తనదైన నవ్వులతో ‘హైపర్ ఆది’గా బాగా ఫేమస్ అయ్యాడు యాదయ్య అలియాస్ ‘హైపర్ ఆది’. సినిమాల్లోనూ నిలదొక్కుకొని లక్షల తీసుకొనే నటుడిగా కూడా ఎదిగాడు. పైగా ఆది స్కిట్ల కోసమే జబర్ధస్త్‌ ను చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువమంది ఉన్నారు.

    Hyper Aadi

    ఆ స్థాయిలో ఆది హవా కొనసాగుతుంది. అందుకే.. సినిమాల్లో కూడా ఆదికి ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. అయితే, పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని అయిన హైప‌ర్ ఆది, తాజాగా భీమ్లా నాయ‌క్ లో న‌టిస్తున్నాడు. కాగా ప‌వ‌న్ ప‌క్కన హ‌రీష్ శంకర్ కూర్చోగా, ఎదురుగా హైప‌ర్ ఆది గొడుగుప‌ట్టుకొని సినిమాలోని పాత్రకు సంబంధించిన గెట‌ప్‌ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు.

    Also Read: కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్

    మొత్తానికి హైప‌ర్ ఆది రేంజ్ మారిపోయింది. నిజానికి పవన్ కి ఎదురుగా కూర్చి వేసుకుని అలా స్టైల్ గా మాట్లాడటం అంటే.. పెద్ద ఆర్టిస్ట్ లు కూడా అలా చేయరు. పవన్ కి సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే అలా క్లోజ్ గా మూవ్ కాగలరు. ఇక ఆది ఎంత ఎదిగినా జబర్దస్త్ తో పాటు మిగిలిన కొన్ని డ్రామాలలో కూడా నటిస్తూ వస్తున్నాడు.

    మొత్తానికి ఒక సాధారణ రైటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి… నటుడిగా మారి.. ప్రస్తుతం స్టార్ నటుడుకిగా ఎదుగుతూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఆది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఏది చేస్తే అది కరెక్ట్ అని నమ్మకం పెట్టుకోవాలంతే అంటూ సింపుల్‌గా చెప్పారు హైపర్ ఆది. అలాగే జనసేన పార్టీలో కూడా చేరతాను అంటూ ఆది చెప్పుకొచ్చాడు.

    Also Read: ప్రత్యేక హోదా’ ఆ ఎన్నిక కోసమేనా?

    Tags