https://oktelugu.com/

Sreemukhi: ప్రేమలో పడిన శ్రీముఖి.. మాట్లాడదాం అంటుంది

Sreemukhi:  ‘శ్రీముఖి’ బుల్లితెర పై చిన్న రాములమ్మ అంటూ విజయశాంతినే ఆమెకు కితాబు ఇచ్చింది, అయితే, శ్రీముఖి మాత్రం తన కెరీర్ ను తన స్థాయికి తగ్గట్టు ప్లాన్ చేసుకోలేదు. బంగారం కురిసే సినీ తెరను వదిలేసి, చిల్లర రాలుతున్న బుల్లితెరకే ఇన్నాళ్లు పరిమితం అయిపోయింది. కాగా శ్రీముఖి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పిక్‌ ను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. వాలంటైన్స్‌ డే రోజున సోషల్ మీడియాలో శ్రీముఖి గులాబీ పూలతో దిగిన […]

Written By:
  • Shiva
  • , Updated On : February 15, 2022 / 10:38 AM IST
    Follow us on

    Sreemukhi:  ‘శ్రీముఖి’ బుల్లితెర పై చిన్న రాములమ్మ అంటూ విజయశాంతినే ఆమెకు కితాబు ఇచ్చింది, అయితే, శ్రీముఖి మాత్రం తన కెరీర్ ను తన స్థాయికి తగ్గట్టు ప్లాన్ చేసుకోలేదు. బంగారం కురిసే సినీ తెరను వదిలేసి, చిల్లర రాలుతున్న బుల్లితెరకే ఇన్నాళ్లు పరిమితం అయిపోయింది. కాగా శ్రీముఖి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పిక్‌ ను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. వాలంటైన్స్‌ డే రోజున సోషల్ మీడియాలో శ్రీముఖి గులాబీ పూలతో దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసింది.

    Sreemukhi

    Sreemukhi

    పైగా తన ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో ‘ఫిబ్రవరి 14, 2022.. ఇది గుర్తు పెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం. జీవితంలోనే బెస్ట్ వాలంటైన్ ఇది’ అంటూ చిన్న మెసేజ్ కూడా పెట్టింది. ఈ మెసేజ్ ను అర్ధం చేసుకుంటే.. శ్రీముఖి కూడా ప్రేమలో పడింది అని అనిపిస్తుంది. అయితే గతంలో శ్రీముఖి ఓ షోలో పాల్గొని అందరూ చూస్తుండగానే యాంకర్‌ ప్రదీప్‌ కు ఐ లవ్ యూ అంటూ సిగ్గు లేకుండా డైరెక్ట్ గా ప్రపోజ్‌ చేసింది.

    Also Read: కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్

    మరి ఇది జస్ట్ జోక్ చేసిందా ? లేక నిజంగానే శ్రీముఖి తన మనసులోని ఆరాటాన్ని ఇలా పబ్లిక్ ముందు కక్కేసిందా ? అనేది చూడాలి. అయితే, అప్పుడు విచిత్రంగా శ్రీముఖి ప్రపోజల్ కి ప్రదీప్‌ కూడా సరే అన్నట్లుగా తెగ సిగ్గు పడిపోయాడు. మరి వీరి మధ్య అప్పటి నుంచి ప్రేమ నడుస్తోంది అన్నట్టు రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి.

    Sreemukhi

    Sreemukhi

     

    మరి పుకార్లకు త్వరలోనే శ్రీముఖి చెక్ పెట్టబోతుంది. ఇక టీవీ షో ఏదైనా ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించడానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేసే శ్రీముఖికి అందుకు తగ్గట్టుగానే యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది, పైగా డిజిటల్ మీడియాలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే, ఎప్పటికప్పుడు తన కొత్త లుక్స్ తో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

    ఇక సినిమాల విషయానికి వస్తే.. తనకు వచ్చిన సినిమా ఆఫర్లను క్యాష్ చేసుకోవాలనే ఆశలో ఏ ఛాన్స్ వదులుకోకుండా రెచ్చిపోయి మరీ తనకొచ్చిన ప్రతి సినిమాని చేసింది శ్రీముఖి. సినిమాకు ఏభై లక్షల వరకూ ఇస్తారు, పైగా సిబ్బందికి, అలాగే మిగిలిన చిల్లర ఖర్చులు అవి ఇవి కలిపి మొత్తంగా రోజుకు మరో లక్ష వరకూ అదనపు సొమ్ము లాగొచ్చు అని ప్రతి చిన్నాచితకా సినిమా చేసి కెరీర్ పాడు చేసుకుంది.

    Also Read:  ఇంటినుంచే కలర్ ఓటర్ కార్డ్ పొందలనుకుంటున్నారా.. ఎలా పొందాలంటే?

    Tags