https://oktelugu.com/

Hyper Aadi: జానీ మాస్టర్ పై సెటైర్లు విసిరిన హైపర్ ఆది..ఆయనకీ ఇలాంటి పనులు మామూలే అంటూ కామెంట్స్!

ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ అనే డ్యాన్స్ షో లో శ్రేష్టి వర్మ అనే అమ్మాయి పరిచయం అవ్వడం, ఆమెని తన టీం లోకి అసిస్టెంట్ గా తీసుకోవడం వంటి విశేషాలు గతంలో మనకి బాగా తెలుసు. వీళ్లిద్దరు కలిసి ఎన్నో రీల్ వీడియోస్ కూడా చేసారు. శ్రేష్టి వర్మ జానీ మాస్టర్ టీం లో చాలా చురుగ్గా ఉండేది.

Written By:
  • Vicky
  • , Updated On : September 17, 2024 / 12:01 PM IST

    Hyper Aadi

    Follow us on

    Hyper Aadi: నిన్నటి నుండి సోషల్ మీడియా లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు ఎలా మారుమోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ అనే డ్యాన్స్ షో లో శ్రేష్టి వర్మ అనే అమ్మాయి పరిచయం అవ్వడం, ఆమెని తన టీం లోకి అసిస్టెంట్ గా తీసుకోవడం వంటి విశేషాలు గతంలో మనకి బాగా తెలుసు. వీళ్లిద్దరు కలిసి ఎన్నో రీల్ వీడియోస్ కూడా చేసారు. శ్రేష్టి వర్మ జానీ మాస్టర్ టీం లో చాలా చురుగ్గా ఉండేది. అవుట్ డోర్ షూటింగ్స్ కి కూడా జానీ మాస్టర్ తనతో పాటు శ్రేష్టి వర్మ ని కచ్చితంగా తీసుకెళ్ళేవాడు. అయితే నిన్న ఆమె జానీ మాస్టర్ మీద సంచలన ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ FIR లో శ్రేష్టి వర్మ జానీ మాస్టర్ గురించి సంచలన విషయాలు పేర్కొంది.

    జానీ మాస్టర్ అవుట్ డోర్ షూటింగ్స్ లో తనతో ఎంతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులు చేసేవాడని, వ్యాన్ లో కూర్చొని ఉంటే ప్యాంట్ విప్పి తనతో చాలా నీచంగా ప్రవర్తించేవాడని ఈ సందర్భంగా పేర్కొంది. అంతే కాదు మతం మార్చుకొని, తనని పెళ్లి చేసుకోమని బెదిరించేవాడు అంటూ ఆమె చేసిన సంచలన ఆరోపణలు సోషల్ మీడియా లో పెను దుమారమే రేపాయి. ఈ వ్యవహారం లో జానీ మాస్టర్ భార్య కి కూడా సంబంధం ఉందట. ఆమె ఇలాంటి ఆరోపణలతో జానీ మాస్టర్ పై కేసు వేసి 24 గంటలు పూర్తి అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆయన మౌనం గా ఉండడం తో కచ్చితంగా తప్పు చేసాడని ఆయనని అభిమానించే వారు కూడా ఫిక్స్ అయిపోయారు. అంటే కాదు జనసేన పార్టీ లో జానీ మాస్టర్ ఒక ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ కేసు విషయం లో ఆరోపణలు ఎదురుకుంటున్న ఈ నేపథ్యం లో జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేసాడు.

    నిజానిజాలు తేలేవరకు పార్టీ కి దూరంగా ఉండాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆదేశించాడు. ఇక వైసీపీ పార్టీ నాయకులు అయితే జానీ మాస్టర్ పై చాలా తీవ్రమైన ట్రోలింగ్స్ వేస్తున్నారు. గతంలో ఢీ షో కి జడ్జి గా వచ్చిన జానీ మాస్టర్ పై ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది అప్పట్లో వేసిన పంచులు షేర్ చేస్తూ, హైపర్ ఆది అప్పట్లోనే హింట్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఫన్నీ వీడియో లో ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు జానీ అని నాకంటే పెద్ద బ్యాట్స్ మ్యాన్ వచ్చాడు అంట కదా. జానీ లో ధోని ఉన్నాడు, ఆయన ఆట ఇప్పట్లో ఆగదు. మీకు శేఖర్ మాస్టర్ తెలుసు కదా, అమాయకుడు పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ జానీ మాస్టర్ అన్నీ డైరెక్ట్. ఆకలి తీర్చడం ఆయనకు అలవాటే’ అంటూ హైపర్ ఆది గతం లో ఢీ షో లో చేసిన కామెడీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.