జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది అంటేనే వివాదాస్పద డైలాగులకు పెట్టింది పేరు. డబల్ మీనింగ్ లతో అతడు చేసే స్కిట్ లు నవ్వులు పూయించినా కూడా వివాదాలు కొనితెస్తాయి. ఆడవారిపై.. ఇతరులపై చేసే లైంగిక కామెంట్స్ ఇప్పటికీ విమర్శల పాలయ్యాయి.
తాజాగా ఓ టీవీ చానెల్ లో తెలంగాణ బతుకమ్మ, గౌరమ్మపై హైపర్ ఆది నోరుజారేశాడు. అదిప్పుడు పెద్ద వివాదమైంది. తెలంగాణ సంస్కృతిని, వారి మనోభావాలను అవమానించారని తెలంగాణ జాగృతి భగ్గుమంది. హైపర్ ఆదికి దిమ్మదిరిగే షాక్ తగిలింది.
హైపర్ ఆదిపై తాజాగా తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ భాష, యాసను అవమానిస్తూ మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జూన్ 12న ఆదివారం రోజున ఓ టాప్ టీవీ చానెల్ లో స్కిట్ చేసిన హైపర్ ఆది తెలంగాణ బతుకమ్మను ఆడుతూ.. గౌరమ్మను, తెలంగాణ భాష యాసని కించపరిచేలా స్క్రిప్ట్ చేశాడని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆది అన్న మాటలు తెలంగాణ వాదులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.