
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుట పల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఉంగటూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన దోమ రఘుబాబు, రాణి దంపతులు బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుల మంతు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. భార్యాభర్తలిద్దరినీ విజయవాడ పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రఘుబాబు మృతి చెందాడు. కాగా రఘుబాబు గతంలో పోస్ట మాస్టర్ గా పని చేశాడు. అతని పై కొన్ని ఆరోపణలు రావడంతో పోస్ట్ మాస్టర్ విధుల నుంచి సస్పండ్ చేశారు.