https://oktelugu.com/

Hanuman Movie: ‘హనుమాన్’ డిజిటల్ రైట్స్ కి భారీ ధర !

Hanuman Movie:  తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘హనుమాన్’ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది. విడుదలకు ముందే రూ.16కోట్ల బిజినెస్ చేసింది. హిందీ నాన్- థియేట్రికల్ రైట్స్ రూ.5 కోట్లకు అమ్ముడుపోయాయి. తెలుగు వెర్షన్ డిజిటల్ రైట్స్‌ను ‘జీ’ సంస్థ రూ.11కోట్లకు దక్కించుకుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తేజకు జోడీగా అమృతా అయ్యర్ నటిస్తోంది. జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ‘ఓ బేబీ’ సినిమాలో కీలక పాత్రలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 4, 2022 / 12:18 PM IST
    Follow us on

    Hanuman Movie:  తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘హనుమాన్’ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది. విడుదలకు ముందే రూ.16కోట్ల బిజినెస్ చేసింది. హిందీ నాన్- థియేట్రికల్ రైట్స్ రూ.5 కోట్లకు అమ్ముడుపోయాయి. తెలుగు వెర్షన్ డిజిటల్ రైట్స్‌ను ‘జీ’ సంస్థ రూ.11కోట్లకు దక్కించుకుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తేజకు జోడీగా అమృతా అయ్యర్ నటిస్తోంది. జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

    teja sajja

    కాగా ‘ఓ బేబీ’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి, తనకున్న బాల నటుడు ఇమేజ్ ను కాస్త, హీరో ఇమేజ్ గా మార్చుకున్నాడు ‘తేజ సజ్జ’. దానికి తోడు జాంబీ రెడ్డి లాంటి వినూత్న సినిమాతో హీరోగా కూడా సక్సెస్ సాధించాడు. దాంతో.. కుర్రాడికి వరుస అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రశాంత్ వర్మ ఈసారి మరో భిన్నమైన కథాంశంతో ఇప్పుడు హనుమాన్ సినిమా చేస్తున్నాడు.

    Also Read:  జగన్ కొట్టలేదట.. నమ్మండి అంటున్నాడు..

    టైటిల్ కూడా హనుమాన్ అని కొత్తగా పెట్టారు. క్రేజీ స్క్రీన్ ప్లేతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హై బడ్జెట్ ను కేటాయించడం కూడా నిజంగా విశేషమే. ఏది ఏమైనా ‘జాంబీ రెడ్డి’ సాధించిన లాభాలు, బాగానే పని చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం తేజ సజ్జ కోసం కూడా కొత్త డైరెక్టర్లు ఎదురుచుస్తున్నారు.

    Hanuman Movie

    సితార లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా తేజ సజ్జతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక చిన్నాచితకా నిర్మాణ సంస్థల గురించి కొత్తగా చెప్పేది ఏముంది. మొత్తమ్మీద తేజకు మంచి డిమాండ్ క్రియేట్ అయింది. ఆ డిమాండ్ కి తగ్గట్టుగానే తేజ సజ్జ కూడా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. పైగా రెమ్యునరేషన్ ను భారీగా పెంచాడు.

    Also Read: పవన్ దెబ్బకు చెల్లాచెదురు.. తలలు పట్టుకున్న మిగిలిన హీరోలు !

    Tags