Prabhas Adipurush: నేషనల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, అదేమిటి ? ప్రభాస్ శ్రీరాముడిగా సెట్ అవుతాడా ? అంటూ బాలీవుడ్ మీడియా నెగిటివ్ గా ప్రచారం చేసింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ తో “ఏ- ఆది పురుష్” రాబోతుంటే.. ఈ సినిమాను క్యాష్ చేసుకోవడానికి చుట్టేస్తున్నారు అంటూ పుకార్లు పుట్టించారు. అయితే, ఈ పుకార్ల పై తాజాగా ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఓం రౌత్ మాట్లాడుతూ.. ‘మైథలాజికల్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ తప్ప మరొకరు సెట్ కారు. ఈ సినిమా కోసం.. ముఖ్యంగా ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించడానికి చాలా రకాలుగా కష్టపడ్డారు. మనం పురాణాల్లో చదువుకున్నాం. విలుకారుల దేహదారుఢ్యం ‘వి’ షేప్ లో ఉంటుందని. అంటే భుజాలు విశాలంగా, నడుము భాగానికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది.
Also Read: Sri Lanka Crisis: శ్రీలంక దుస్థితి ఏ దేశానికి రాకూడదా?
ప్రభాస్ ఈ వి షేప్ ఆకృతి కోసం చాలా కష్టపడ్డారు. పైగా విలువిద్యలో ప్రభాస్ శిక్షణ కూడా తీసుకున్నారు. ఇక డైలాగ్స్ విషయంలో అయితే.. ఎంతో గొప్పగా సాధన చేశారు. అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ పర్‌ఫెక్ట్ యాప్ట్.. అసలు ప్రభాస్ లాగా మరో ఏ స్టార్ హీరో ఈ సినిమాకి సెట్ కాడు’ అంటూ ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. అన్నట్టు జనవరిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
కాగా “ఆదిపురుష్” చిత్రం తన జీవితంలో చాలా ముఖ్యమైన ప్రాజెక్టని హీరో ప్రభాస్ అన్నాడు. అందుకే ఈ చిత్రాన్ని ఒకే సమయంలో 15 దేశీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతుండగా.. సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.

ఇక లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే సినిమాలో భారీ సెట్లు, భారీ క్రూ వగైరా వ్యవహారాలు లాంటివి లేకుండా మోషన్ కాప్చర్ విధానంలో నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారట. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా వుంటుందని, పైగా చాలా సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు మేకర్స్.
Also Read:AP New Districts-CM Jagan: కొత్త జిల్లాలను ప్రారంభించిన జగన్.. అభివృద్ధి ఊసే ఎత్తలే..
[…] Anasuya Bharadwaj: క్రేజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ కి సుకుమార్ ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర ఇవ్వడం వెనుక కారణం ఏమిటి ? అని ఎవ్వరూ అడగలేదు. ఆ పాత్రకు ఆమె సూట్ అవుతుంది కాబట్టి ఇచ్చాడు అని అనుకున్నారు. ఇక పుష్ప సినిమాలో కూడా నెగిటివ్ యాంగిల్ లో అనసూయను చూపించాడు. పైగా పుష్ప 2 లో అయితే మెయిన్ లేడీ విలన్ గా అనసూయను సుకుమార్ ప్రమోట్ చేస్తున్నాడు. […]
[…] Priyanka Jawalkar: తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కి ప్రస్తుతం అవకాశాలు రాకపోయినా.. ప్రేమ పాఠాలు మాత్రం బాగానే నేర్చుకుంటుంది. తన లవ్ ముచ్చట్లతో ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ డేటింగ్‌లో ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. […]
[…] […]