Mudragada Padmanabham- ABN RK: గులివింద సామెతలా ఉంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాక్రిష్ణ పరిస్థితి. చేతిలో మీడియా ఉంది కదా అని ఆయన ఏ మాట చెప్పినా చెల్లుబాటు అవుతుందనకుంటున్నారు. దమ్మున్నమీడియా అంటూ ఆయన ఏం చేసినా అడిగే వారు లేరనుకుంటున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయనకు రాసిన లేఖాస్త్రం రాధాక్రిష్ణకు గట్టిగానే తాకింది. ఎంతలా అంటే ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికన వార్త ఇచ్చుకునేదాక. అసలు ముద్రగడ చేసిన వ్యాఖ్యానాల్లో చిన్నపాటి అంశాలకే ప్రాధాన్యమిచ్చిన రాధాక్రిష్ణ మిగతా వాటి జోలికి వెళ్లకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అంటే ఒక్క విరాళాల సేకరణ తప్పించి ముద్రగడ చేసిన ఆరోపణలన్నింటికీ ఆయన ఒప్పుకున్నట్టేనాని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఇంటర్వూ చేశారు. కాపు ఉద్యమ నేతలు అదే సామాజికవర్గం వారిని ఆర్థికంగా బలోపేతం చేసిన దాఖలాలు లేవంటూ రాధాక్రిష్ణ వ్యాఖ్యానం చేశారు. దీనిపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ధీటుగా స్పందించారు. నేరుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణకు లేఖరాశారు. రాధాక్రిష్ట అక్రమ మార్గంలో ఎలా ఎదిగింది? ఆంధ్రజ్యోతి పూర్వపు యజమాని, ఫౌండర్ కేఎల్ఎన్ ప్రసాద్ గారిని మోసగించి పత్రికను ఎలా స్వాధీనం చేసుకున్నారు? డొక్కు స్కూటర్ పై తిరుగుతూ వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యింది? ఎన్నికల ముందు తెలంగాణాలో బెట్టింగులకు ఎలా ప్రొత్సహించింది? చంద్రబాబును ఎలా తప్పుదోవ పట్టించి నాశనం చేసింది? అవిభక్త కవలల వైద్య ఖర్చుల కోసం విరాళాల సేకరణ, అమరావతి గురించి విరాళాల సేకరణ ఎలా చేశారు? నిధులు ఎలా పక్కదారి పట్టించారో..వ్యంగ్యోక్తులు సంధిస్తూ లేఖలో ప్రస్తావించారు. కానీ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ సోమవారం తన పత్రికలో కేవలం కొన్నింటిపైనే క్టారిటీ ఇచ్చారు. పైగా నిబద్ధత కలిగిన తనపైనా, తన సంస్థపైనా నిరాధారణ ఆరోపణలు చేస్తే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.
Also Read: Prabhas Adipurush: ప్రభాస్ ఆ షేప్ కోసం చాలా కష్టపడ్డారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
గొప్ప నినాదాలతో బాక
అక్షరం మా ఆయుధం! నిబద్ధత మా విధానం.. ఇది రాధాక్రిష్ణ నిత్యం వల్లె వేసే మాట. కానీ ఆయన కొన్ని పార్టీకే కొమ్ము కాయడం ఆయన నైజం. ఎవరికీ కొమ్ము కాయమంటూనే ఆయన ఎవరి పల్లకి మోస్తుంటారో తెలియంది కాదు. ఎప్పుడూ రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చి పత్రికకు దండిగా ఆదాయం సంపాదించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చిన్నపాటి కార్యక్రమం నిర్వహించినా, పథకం ప్రారంభించినా ఫుల్ పేజీ యాడ్లు సొంతం చేసుకున్న మాట వాస్తవం కాదా? అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల అనుమతులు లభించిన మాట వాస్తవం కాదా? ఏ పార్టీలో ఉన్నా కమ్మ సామాజికవర్గీయులకు పత్రికలో ప్రాచుర్యం కల్పించడం మాట తెలియంది కదూ. ఇంటర్వూలో ఎమ్మెల్యే రామానాయుడును ప్రశ్నించినప్పుడు ఆయన కాపు జాతీపై తనలో ఉన్న కర్కశాన్ని ప్రదర్శించారు. మీ కులంలో పారిశ్రామిక వేత్తలు ఎందుకు లేరని ప్రశ్నించారు. ఉన్నా వేళ్లతో లెక్క కట్టొచ్చని సంబోధించారు. అంతటితో ఆగకుండా మీలో ఐక్యత లేదని చెప్పారు.

అయితే ఇన్నేళ్లు పత్రికను నడిపిన ఆయనకు ఈ విషయం తెలియంది కదా? నాడు ప్రజారాజ్యం పార్టీపై బురదజల్లారు. జెండా పీకేస్తున్నారంటూ ముందుగానే పత్రికల్లో కథనాలు వండి ఓర్చారు. చిరంజీవి సహజంగా మ్రదు స్వభావి కావడం, రాజకీయాలకు తట్టుకోలేక భయపడి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’ అంటూ కథనాలు సైతం రాసి మైలేజీ పెంచుకున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఈ పాచిక పారలేదు. ప్రస్తుతం జనసేనాని అవసరం తాను ఆరాధించే చంద్రబాబుకు అవసరం. అందుకే రాధాక్రిష్ణకు కాపులు గుర్తొచ్చారు. కాపులను చంద్రబాబు గూటికి చేర్చాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రయత్నమైతే మంచిది కాని.. కాపుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానాలు చేయడం ఇకనైనా మానుకోవాలి.
Also Read: Sri Lanka Crisis: శ్రీలంక దుస్థితి ఏ దేశానికి రాకూడదా?