Homeఆంధ్రప్రదేశ్‌Joseph Ravan: జోసెఫ్ రావణ్ కు మద్దతుగా మరో రాజకీయ పార్టీ!

Joseph Ravan: జోసెఫ్ రావణ్ కు మద్దతుగా మరో రాజకీయ పార్టీ!

Joseph Ravan: ఏపీలో రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా మతపరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. జోసెఫ్ రావణ్ అరెస్ట్ తర్వాత రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. జోసెఫ్ రావణ్ అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. అతి కఠినమైన ఉగ్రవాదులపై మోపే కేసులు సైతం నమోదు అయ్యాయి. మరోవైపు జోసెఫ్ రావణ్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయసహాయం అందిస్తోందన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు దీనిపై సిపిఐ నారాయణ కామెంట్స్ చేయడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్ ఇదే మాదిరిగా వ్యవహరించారని.. చెప్పు కూడా చూపించారని.. దూషణలకు దిగారని.. పవన్ కళ్యాణ్ పై చర్యలు లేవని.. అటువంటిప్పుడు జోసెఫ్ రావణ్ పై ఎలా చర్యలు తీసుకుంటారంటూ నారాయణ ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం యూటర్న్ తీసుకుంది.

* బలం అంతంత మాత్రం..
ప్రస్తుతం ఏపీలో వామపక్షాలకు అంత బలం లేదు. పైగా పార్టీ ది లౌకికవాదం. అటువంటి వామపక్షాలు కచ్చితంగా దీనిపై స్పందిస్తాయి. అందులో తప్పులేదు. పైగా పవన్ అంటే వామపక్షాలకు పడదు. అదే వామపక్షాలతో జతకట్టారు పవన్ కళ్యాణ్. వర్కౌట్ కాదని తెలిసి వారిని వదిలేసారు. భారతీయ జనతా పార్టీతో స్నేహం చేశారు. ఆ పార్టీని ఒప్పించి తెలుగుదేశం పార్టీతో కలిసేలా చేశారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిర్చారు. వామపక్షాలను విడిచిపెట్టారన్న కోపం వారిలో ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో వామపక్ష నాయకులు ఎప్పుడూ భిన్నంగా స్పందిస్తుంటారు. ఇప్పుడు సిపిఐ నారాయణ అలానే స్పందించారు. పవన్ కళ్యాణ్ గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇదే మాదిరిగా మాట్లాడారని.. చెప్పు కూడా చూపించారని నాటి సంగతులను గుర్తు చేశారు. పవన్ కంటే జోసెఫ్ రావణ్ బెటర్ అన్నట్టు మాట్లాడారు.

* ఏది జరిగినా వైసీపీకే..
ఇప్పటివరకు జోసెఫ్ రావణ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం చేసింది అనే ఆరోపణ ఉంది. ఇప్పుడు నారాయణ మాట్లాడడం ద్వారా ఆ జాబితాలో సిపిఐ కూడా చేరినట్లు అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఒకటి ఉంది. ఆ సామాజిక వర్గం ఓట్ల కోసమే ఆ పార్టీ జోసెఫ్ రావణ్ కోసం న్యాయ సహాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే వైసిపి తప్పులేదు కానీ ఇప్పుడు ఆ జాబితాలో సిపిఐ చేరింది. అయితే సిపిఐ కి వచ్చిన ముప్పు లేదు. ఎందుకంటే ఆ పార్టీకి ఏపీలో పెద్దగా బలం లేదు. అందుకే ఆ పార్టీ పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కేవలం పవన్ పై ఉన్న కోపంతో వామపక్షాలు స్పందించి ఉండొచ్చు. ఒకవేళ ఈ ఘటన ద్వారా రాజకీయ లబ్ధి పొందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. డ్యామేజ్ జరిగిన ఆ పార్టీకే..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Oktelugu Epaper
Exit mobile version