https://oktelugu.com/

Tollywood Actress: చందమామ సినిమా హీరోయిన్ గుర్తుందా ?? గుర్తు పట్టలేనంతగా ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ?

chandamama Movie Heroine: హీరోయిన్‌ సింధు మీనన్‌ అంటేనే ముద్దుగా బొద్దుగా ఉంటుంది, పైగా తన అందంతో ఆమె అప్పట్లో ఒక ఊపు ఊపింది. మంచి చిత్రాల్లో నటించి ఎందరో హీరోల సరసన ఆడిపాడింది. తెలుగుతో పాటు కన్నడ సినిమాలలో కూడా ఆమె స్టార్ గా ఒక వెలుగు వెలిగింది. కానీ, తాజాగా సింధు మీనన్‌ లుక్ చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అరె.. అందాల తార ఇలా అయిపోయిందేమిటి అంటూ ఆశ్చర్యచకితులు అవుతున్నారు. Chandamama […]

Written By:
  • Shiva
  • , Updated On : March 21, 2022 / 01:29 PM IST
    Follow us on

    chandamama Movie Heroine: హీరోయిన్‌ సింధు మీనన్‌ అంటేనే ముద్దుగా బొద్దుగా ఉంటుంది, పైగా తన అందంతో ఆమె అప్పట్లో ఒక ఊపు ఊపింది. మంచి చిత్రాల్లో నటించి ఎందరో హీరోల సరసన ఆడిపాడింది. తెలుగుతో పాటు కన్నడ సినిమాలలో కూడా ఆమె స్టార్ గా ఒక వెలుగు వెలిగింది. కానీ, తాజాగా సింధు మీనన్‌ లుక్ చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అరె.. అందాల తార ఇలా అయిపోయిందేమిటి అంటూ ఆశ్చర్యచకితులు అవుతున్నారు.

    Sindhu Menon

    Chandamama Movie Heroine

    కెరీర్‌ లో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలోనే సింధు మీనన్‌ ఐటీ ప్రాఫెషనల్‌ అయినా డొమినిక్‌ ప్రభును 2010 లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాపా, ఒక బాబు కూడా ఉన్నారు. ఇటీవలే సింధు మీనన్‌ ఫ్యామిలీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి కూడా. ఇక పెళ్లి తర్వాత సింధు మీనన్‌ సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. నటనకు దూరం అయినా పర్సనల్ లైఫ్ లో మాత్రం ఆమె ఆర్థికంగా బాగానే ఎదిగింది.

    Also Read: AP Politics: ఆ బ్రాండ్స్ తెచ్చింది చంద్రబాబే.. కౌంటర్లు వేస్తున్న వైసీపీ..

    కాకపోతే పెరిగిన వయసు రీత్యా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎవరూ గుర్తు పట్టని విధంగా మారిపోయింది. నిజానికి గతంలోనే బాగా లావైపోయిన ఆమెను చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇప్పుడు ఆమె కొత్త లుక్ చూసి, అసలు ఈమె సింధు మీననేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతగా సింధు మీనన్‌ మారిపోయింది. మరి ఇలా అయిపోయిందేమిటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కూడా షాక్ అయినట్టు ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు.

    అయితే అందాల సింధు మీనన్‌ ఇలా మారిపోవడానికి కారణం గురించి ఆమె ఓ సందర్భంలో చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యింది. పెళ్లి అయ్యాక ఇలా మారాల్సి వచ్చింది అని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె వివరణ విన్నాక ఆమె అభిమానులు మెసేజ్ లు చేస్తూ.. మీరు తల్చుకుంటే ఇదివరకటిలా మారగలరు కదా అని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా నాజూకుగా ఉండటానికి నేను ఇప్పుడు హీరోయిన్‌ను కాదు అంటూ తానూ ఇలాగే ఉంటాను అని స్పష్టం చేసింది సింధు మీనన్‌.

    సింధు మీనన్‌ మలయాళీ కుటుంబంలో జన్మించింది. చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకుంది. జయరాం దర్శకత్వం వహించిన రశ్మి అనే కన్నడ చిత్రంతో సింధు మీనన్‌ 1994లో సినిమా ఇండస్తీలో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. చైల్స్‌ ఆర్షిస్ట్‌ గా కొన్ని సినిమాలు చేసిన సింధు మీనన్‌.. 1999 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది.

    Also Read: Jalsa Web Series review: ఓటీటీ రివ్యూ : జల్సా – అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

     

    Recommended Video:

    Tags