Y S Jagan Finalising New Cabinet Ministers: ఏపీలో రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అటు టీడీపీ, బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ పార్టీలకు చిక్కకుండా వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. మరో వైపు జనసేన నాయకులు సైతం ప్రజల మధ్యే ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న కొత్త జిల్లాలను తెరపైకి తీసుకొచ్చిన వైసీపీ.. తాజాగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతున్నా.. ఇంకా కొలిక్కి రావడం లేదు.
2011లో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి ఊహకు అందని విధంగా సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏపీ, తెలంగాణ విడిపోవడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ అధికారం చేపట్టింది. తర్వాత 2019 ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్సార్ సీపీకి సెంటింమెంట్ వర్కవుట్ కావడంతో ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ దెబ్బ నుంచి టీడీపీ ఇంకా కోలుకోవడం లేదు.
Also Read: AP Politics: ఆ బ్రాండ్స్ తెచ్చింది చంద్రబాబే.. కౌంటర్లు వేస్తున్న వైసీపీ..
ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీడీపీ ఉత్సాహం చూపుతోంది. మరో వైపు బీజేపీ సైతం తన బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడే వారికే మద్దతు ఇస్తామంటూ జనసేన ప్రకటించింది. ఈ పార్టీలను దాటుకుని ఎలాగైన మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ స్కెచ్ వేస్తోంది. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో సగం మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేలా కనిపించడం లేదు.
కొత్త వారికి చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు తాజాగా కేబినెట్ విస్తరణను సైతం ముందేసుకుంది. శ్రీకాకుళం నుంచి స్పీకర్ తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. విజయనగరం నుంచి వీరభద్రస్వామి, రాజన్నదొర పదవి ఆశిస్తున్నవారిలో ఉన్నారు.
విశాఖ నుంచి గుడివాడ అమర్‌నాథ్, తూర్పుగోదావరి నుంచి ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, పశ్చిమగోదావరి నుంచి ప్రసాదరాజు, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ కేబినెట్‌లో చోటుకోసం ఎదురుచూస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి, సామినేని ఉదయభాను, రామకృష్ణారెడ్డి, బాపట్ల నుంచి కోన రఘుపతి, మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. నెల్లూరు నుంచి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎస్సీ కోటాలో కిలివేటి సంజీవయ్య మంత్రి పదవిని కోరుకుంటున్నారు. చిత్తూరు నుంచి రోజా రేసులో ఉంది.
Also Read: Telangana Congress Party: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న హరీశ్‌రావు.. వీహెచ్‌కు పైసలిచ్చిండట..!
Recommended Video: