Bollywood Remakes: తెలుగు సినిమా అంటే.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయింది. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ అండ్ శాండల్ వుడ్ ఇలా అన్ని వుడ్ ల నిర్మాతల చూపు తెలుగు ఇండస్ట్రీ పైనే ఉంది. ఈ మధ్య ఇక్కడ హిట్టైన సినిమాలను హిందీలోకి రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి అక్కడ నిర్మాణ సంస్థలు. నిజానికి ఒకప్పుడు హిందీ సినిమా అంటే అన్నీ ఇండస్ట్రీ వాళ్లకు మోజు ఉండేది. కానీ సీన్ రివర్స్ అయింది. ఆ హిందీ వాళ్ళకే ఇప్పుడు తెలుగు సినిమా అంటే మోజు పెరిగింది.
Ala Vaikuntapuramlo
భారతీయ సినిమా అంటే దక్షిణాది సినిమా అనే స్థాయికి వెళ్ళింది తెలుగు సినిమా. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా తెలుగు సినిమా ప్రభ ప్రస్తుతం బాగా వెలిగిపోతోంది. తెలుగు సినిమాల కోసం బాలీవుడ్ మేకర్స్ మధ్య గట్టి పోటీ ఉంది. తెలుగులో ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు.. వెంటనే.. ఆ సినిమా రైట్స్ కోసం పబ్లిక్ గా తిట్టుకునే పరిస్థితికి వచ్చేశారు హిందీ మేకర్స్.
Jersey Movie
పైగా హిందీ బడా నిర్మాతలు ఇప్పుడు తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా వరుస పాన్ ఇండియా సినిమాలు చేయాలని హిందీ దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజంగా ఇది గ్రేటే. ఎన్టీఆర్ డేట్లు కోసం బాలీవుడ్ ఎదురుచూస్తోందట.
Hit Movie
అన్నట్టు సౌత్ లో వచ్చిన పాతిక సినిమాలను రీమేక్ చేయాలని బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాలపై హిందీ మేకర్స్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అల్లు అర్జున్ అల…వైకుంఠపురములో, నాని జెర్సీ, హిట్, అల్లరి నరేష్ నాంది చిత్రాలతో పాటు ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమాను ఆల్ రెడీ రీమేక్ చేస్తున్నారు. అలాగే బాలయ్య ‘అఖండ’ సినిమా పై హిందీ చిత్ర పరిశ్రమ ఆసక్తి చూపిస్తోంది.
Hit Movie
Also Read: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి ఆమె !
అలాగే ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే.. కైతి, జిగర్తాండ, అన్నీయన్, విక్రమ్ వేధ, ధ్రువంగళ్ పతినరు, రాత్ససన్, తాడం, కోమలి, మానగరం, అరువి, మానాడు, సూరరై పొట్రు, మాస్టర్ వంటి తమిళ సూపర్ హిట్ చిత్రాలను రీమేక్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలన్నీ హిందీ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాయి. మలయాళ సినిమాల విషయానికి వస్తే.. డ్రైవింగ్ లైసెన్స్, దృశ్యం 2, హెలెన్, అయ్యప్పనుమ్ కోషియుమ్, నయట్టు.. లాంటి మంచి చిత్రాలు హిందీలోకి వెళ్తున్నాయి. ఇక కన్నడ చిత్ర పరిశ్రమ నుండి, యు-టర్న్‌లు హిందీ చిత్ర పరిశ్రమను ఆకట్టుకోబోతున్నాయి.
Also Read: ‘పుష్ప’ను మిస్ చేసుకున్న స్టార్లు వీళ్ళే !
Vikram Vedha