RRR Theatrical Documentary
RRR Theatrical Documentary : ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రకటన నాటి నుండి సంచలనమే. ఫ్యాన్ రైవల్రీ కలిగిన మెగా-నందమూరి హీరోలు కలిసి మూవీ చేస్తున్నారన్న న్యూస్ ఆసక్తి రేపింది. అలాగే బాహుబలి 2 అనంతరం రాజమౌళి చేస్తున్న మూవీ కావడంతో, ఏ స్థాయిలో ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు వంటి నిజ జీవిత పోరాట యోధుల స్పూర్తితో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రలను డిజైన్ చేశారు. వేరు వేరు లక్ష్యాలు కలిగిన భీమ్, రామరాజు.. బ్రిటిషర్స్ పై ఎలా యుద్ధం చేశారు అనేది కథ.
ఈ మూవీ 2022 సమ్మర్ కానుకగా విడుదలైంది. వరల్డ్ వైడ్ రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జపాన్ లో లాంగ్ రన్ నడిచిన ఈ చిత్రం, అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది. వీటన్నింటికీ మించి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ ఆస్కార్ కి ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సైతం కైవసం చేసుకుంది.
ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ లోకి వచ్చి రెండేళ్లు అవుతుండగా డాక్యుమెంటరీ అందుబాటులోకి తెచ్చారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలోని అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్, అలరించే సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో తెలియజేసే, మేకింగ్ వీడియోతో డాక్యుమెంటరీ కూడి ఉంది. దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ అభిప్రాయాలు, అనుభవాలు తెలియజేశారు. అలాగే సాంకేతిక వర్గం కూడా ఆర్ ఆర్ ఆర్ తో ముడిపడిన తమ అనుభవాలు షేర్ చేశారు.
కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ మేకింగ్ డాక్యుమెంటరీ తప్పక చూడాల్సిందే. ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఇది ఒక గైడ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ లో డిసెంబర్ 27 నుండి ఆర్ ఆర్ ఆర్ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. అజయ్ దేవ్ గణ్, అలియా భట్ లు సైతం ఆర్ ఆర్ ఆర్ గురించి తమ అభిప్రాయాలు షేర్ చేశారు.