Vinod Kambli: వినోద్ కాంబ్లీ కి డాక్టర్ ద్వివేది ఆధ్వర్యంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం వినోద్ పూర్తిస్థాయిలో జ్ఞాపకశక్తిని పొందలేరట. ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ విగ్రహ ఆవిష్కరణలో తన స్నేహితుడు సచిన్ టెండుల్కర్ ను వినోద్ కాంబ్లీ గుర్తుపట్టలేకపోయారు. మద్యపానానికి అలవాటు పడటం వల్ల వినోద్ జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయారు. అయితే ఇప్పుడు ఆయన ఆ అలవాటును మానుకున్నారు. వినోద్ మొన్నటిదాకా రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందారు. అయితే అతడికి మంచి పోషకాహారం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. అలా అయితేనే అతడు కోల్కుంటాడని పేర్కొంటున్నారు. అతడిలో న్యూరో మార్పుల వల్ల జ్ఞాపకశక్తి కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆయనకు శస్త్ర చికిత్స చేయకుండానే.. మెరుగైన రిహాబిలిటేషన్ ఇవ్వడం వల్ల 90% వరకు ఆరోగ్యాన్ని అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గతంలో వినోద్ మద్యం విపరీతంగా తాగేవారు. సిగరెట్లు కూడా కాల్చేవారు. అందువల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇక ప్రస్తుతం అతడికి రెండుసార్లు ఫిజియోథెరపీ అందించాల్సిన అవసరం ఉందని.. స్పీచ్ థెరపీ వంటి చికిత్స ఇవ్వాలని.. పోషకాహారం కూడా ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. ఆయన ఇదే విధానాన్ని పట్టుదలతో కొనసాగిస్తే ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అది సాధ్యం కాదు
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నూటికి నూరు శాతం జ్ఞాపకశక్తిని తిరిగి పొందలేరని స్పష్టం చేస్తున్నారు. ఆయన నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని.. దీనికోసం భారీగానే ఖర్చు అవుతుందని వైద్యుల వివరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఆయనకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అవసరం ఉంటుందని.. స్నేహితుల నుంచి సహకారం ఉండాలని.. అప్పుడే తదుపరి చికిత్స అందించడానికి అవకాశం ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. ” వినోద్ అప్పట్లో మద్యం విపరీతంగా తాగారు. గత మూడు నెలలుగా ఆయన మద్యానికి దూరంగా ఉంటున్నారు. అయితే మద్యం విపరీతంగా తాగడం వల్ల ఆయన న్యూరో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానివల్ల జ్ఞాపకశక్తిని కోల్పోయారు. అయితే అతడికి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అందించాల్సిన అవసరం ఉంది. పోషకాహారం కూడా ఇవ్వాల్సి ఉంది. అప్పుడే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికోసం భారీగానే ఖర్చు అవుతుంది.. వైద్యులు కూడా ఆయనను ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండాలి.. నిష్ణాతులైన వైద్యులు కేవలం ఆయన సేవలోనే ఉండాలి.. ఇలా కొద్దిరోజుల పాటు జరిగిన తర్వాత అప్పుడు వినోద్ కోలుకునే అవకాశం ఉంటుంది.. అయితే నూటికి నూరు శాతం ఆయన జ్ఞాపకశక్తిని తిరిగి పొందలేరు.. ఎందుకంటే ఆయన న్యూరో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వయసు రిత్యా ఆ సమస్య పరిష్కరించడం సాధ్యం కాదని” వైద్యులు చెబుతున్నారు.