Star Hero: మోడలింగ్ రంగంలో ఉన్న సమయంలోనే యాడ్స్ లో నటించి ఆ తర్వాత సినిమాలలో హీరో, లేదా హీరోయిన్ గా కనిపించిన వారు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. యాడ్స్ నుంచి తమ కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాలలో సెటిల్ అయినా నటీనటులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. మరి కొంతమంది సినిమాలలో సక్సెస్ అయిన తర్వాత యాడ్స్ లో నటించిన వాళ్లు కూడా ఉన్నారు. స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు దాదాపు అందరూ కూడా ఏదో ఒక యాడ్లో కనిపిస్తూనే ఉంటారు. ఒక్క సినిమా హిట్ అయితే మాత్రం వాళ్లకు యాడ్స్ క్యూ కడతాయి. క్రికెట్ ఆటగాళ్లు సైతం యాడ్స్ లో కనిపిస్తుండడం మీరు చూసే ఉంటారు. అయితే ఎన్ని కోట్లు ఆఫర్ ఇచ్చిన యాడ్స్ కి మాత్రం నో చెప్తున్నారు ఈ స్టార్ హీరో మరియు స్టార్ హీరోయిన్. సినిమాల కంటే యాడ్స్ లోనే ఎక్కువగా కనిపించే నటీనటులు ఉన్నారు. సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క యాడ్లో కూడా కనిపించని ఈ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. కోట్లు ఇస్తామన్నా యాడ్స్ చేయడానికి ముందుకు రాని హీరో రజనీకాంత్. అయితే స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా కోట్ల ఆఫర్ వస్తున్న ఇప్పటివరకు ఒక యాడ్లో కూడా కనిపించలేదు. సినిమా హిట్ అయిన వెంటనే నటీనటులు యాడ్ చేయడానికి ఒప్పుకుంటారు. బుల్లితెర మీద నటించే నటీనటులు అలాగే సినిమాలలో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం యాడ్స్ లో కనిపిస్తుంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు రజనీకాంత్ 170 సినిమాలలో నటించారు. కానీ ఇప్పటివరకు రజనీకాంత్ ఒక యాడ్లో కూడా నటించలేదు. రజనీకాంత్ తర్వాత వచ్చిన స్టార్ హీరోలు కూడా ఎక్కువ మొత్తంలో పారితోషకం తీసుకొని యాడ్స్ లో నటిస్తుంటే రజనీకాంత్ మాత్రం యాడ్ చేయడానికి నో అంటున్నారు.

రజినీకాంత్ యాడ్స్ లో నటించకపోవడంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా సినిమాలతో టాప్ లో ఉన్న సమయంలోనే యాడ్స్ చేయనని ధైర్యంగా చెప్పారంట సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ సమయంలో హీరో రజినీకాంత్ కు రాజకీయాల్లోకి రావాలని ఉండేదట. దాంతో అప్పట్లో ఆయన యాడ్స్ కు నో చెప్పడం జరిగింది. ఇక రజనీకాంత్ అప్పటినుంచి యాడ్ లలో నటించలేదని తెలుస్తుంది. అయితే సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో డాన్స్ తో అందరినీ ఫిదా చేసేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు. నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు కూడా యాడ్ చేయడానికి నో చెప్పేస్తుంది.
దీనికి ప్రధాన కారణం ఇదే. యాడ్స్ లో ప్రోడక్ట్ నేచురల్ అయితే సాయి పల్లవి చేసేదట. కానీ కాస్మోటిక్ కు సంబంధించిన యాడ్ అయితే ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని భావించి ప్రమోట్ చేయలేదంట ఈ బ్యూటీ. ఈ యాడ్ చేయడానికి సాయి పల్లవి కి రెండు కోట్ల రూపాయలు పారితోషకం ఇస్తామన్నా ఈ అవకాశాన్ని వదులుకుందంట. సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తూ గ్లామర్ కు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇలా రజనీకాంత్ మరియు సాయి పల్లవి యాడ్స్ కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి ప్రస్తుతం హీరో నాగచైతన్య కి జోడిగా తండేల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. వచ్చే ఏడాది రజనీకాంత్ మరియు సాయి పల్లవి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.