Harihara Veeramallu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉండటం వల్ల వరుస సినిమాలు చేయలేకపోయిన కూడా అడపదడపా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఏ ఏం రత్నం ప్రొడ్యూసర్ గా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని ఇప్పటికే అభిమానులు చాలా మంచి కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి జనవరి 17వ తేదీన ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ అయితే రాబోతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ చాలా అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకోవడంతో ఏ ఏం రత్నం కొడుకు అయినా జ్యోతి కృష్ణ ఈ సినిమాను డైరెక్షన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాను అనుకున్న రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ఏమైనా ఇన్ పుట్స్ ఇస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్లను రాబడతాడా? తద్వారా స్టామినా ఏంటో పాన్ ఇండియా లెవెల్లో అందరికీ చూపించబోతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ చి ఇమాకోసం 300 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నటుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ రేంజ్ అనేది మరోసారి మరో మెట్టు పైకి ఎక్కుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఆయన ఫుల్ ఫ్లెడ్జడ్ గా రాజకీయాలో వెైపు వెళ్లబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాతో పాటు మిగిలిన రెండు సినిమాలను కూడా కంప్లీట్ చేసి ఈ సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఆయన కొత్త సినిమాలకు కమిట్ అవుతాడా?
లేదంటే రాజకీయాలపై తన దృష్టి మొత్తాన్ని పెట్టబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇకమీదట కూడా భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు..