Smriti Mandhana : క్రికెట్(Cricket) చరిత్రలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పురుషుల జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మహిళా జట్టు(Womens team) కూడా ఇప్పుడిప్పుడే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. మిథాలిరాజ్, హర్మన్‌ప్రీత్‌సింగ్, స్మృతి మంధన తదితర క్రికెటర్లు ప్రపంచ క్రికెట్‌లో రాణిస్తూ భారత కీర్తిని చాటుతున్నారు. ఈ క్రమంలో భారత మహిళా క్రికెట్ చరిత్రలో మరో రికార్డు నమోదైంది. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ స్మృతి మంధన సెంచరీతో చెలరేగారు. కేవలం 70 బంతుల్లో 100 పరుగులు సాధించి ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్‌గా చరిత్రకెక్కారు. ఇంతకు ముందు ఈ రికార్డు హర్మన్‌ప్రీత్‌సింగ్(87 బంతుల్లో)పేరిట ఉంది. ఇప్పుడు ఆ తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే రెండో వన్డేలోనూ స్మృతి సెంచరీ చేయడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో 135 పరుగులు చేసి ఔట్ అయింది. మొత్తం 80 బంతుల్లో 135 పరుగులు చేసింది. సెంచరీ తర్వాత పది బంతుల్లోనే 35 పరుగులు చేయడం గమనార్హం.
భారీ పార్ట్‌నర్‌షిప్..
ఇక స్మృతి మంధన, ప్రతీక రావల్(Prateeka raval)తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వన్డే క్రికెట్‌లో తొలి వికెట్ భాగస్వామ్యం కూడా అత్యధికమే.
మ్యాచ్ ఇలా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలిసారి వన్డేల్లో 400పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించింది. కెప్టెన్ స్మృతి మంధన(135), మరో ఓపెనర్ ప్రతీకా రావల్(154) శతకాలతో చెలరేగి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన రిచా ఘోష్ హాఫ్ సెంచరీ నమోదు చేసింది. 59 పరుగుల వద్ద ఔట్ అయింది. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 435 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో స్మృతి రికార్డులు..
ఇక ఈ మ్యాచ్‌లో స్మృతి మంధన పేరిట పలు రికార్డులు నమోదయ్యాయి.
– వన్డే క్రికెట్‌లో 500లకుపైగా బౌండరీలు కొట్టిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు.
– వన్డే క్రికెట్‌లో పది కన్నా ఎక్కువ సెంచరీలు చేసిన నాలుగో మహిళగా స్మృతి నిలిచారు. వన్డేల్లో స్మృతికి ఇది పదో సెంచరీ.