TS SETS Exam 2025 : తెలంగాణలో లక్షత మంది విద్యార్థులు వివిధ ప్రవేశ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. మరో రెండు నెలల్లో విద్యా సంవత్సంర ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉన్నత చదువులకు ప్రవేశ పరీక్షల ద్వారానే ప్రవేశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈఏపీ సెట్ (TS EAPCET) పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 29న ఈఏపీ సెట్ జరుగుతుంది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఈఏపీసెట్(అగ్రికల్చర్, ఫార్మసీ) పరీక్షలు జరుగునున్నాయి. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఈఏపీసెట్(ఇంజినీరింగ్) పరీక్షలు జరుగుతాయి. టీజీ ఈసెట్ ప్రవేశ పరీక్ష మే 12న, టీజీ ఎడ్‌సెట్ పరీక్ష జూన్ 1న, టీజీ లాసెట్, ఎఎల్‌ఎం కోర్సులకు జూన్ 6న, ఐసెట్ జూన్ 8, 9 తేదీల్లో టీజీ పీజీ ఈసెట్ పరీక్షలు జూన్ 16 నుంచి 19 వరకు, టీజీ పీఈసెట్ జూన్ 11 నుంచి 14 వరకు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించింది.
జేఈఈ మెయిన్స్ వివరాలు..
ఇక దేశవ్యాప్తంగా జనవరి 22న జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఎవరికి ఏ రోజు పరీక్ష ఉంటుంది. కేంద్రం ఎక్కడ తెలుసుకోవచ్చని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) జనవరి 10 ప్రకటించింది. ఈ మేరకు జేఈఈ సిటీ ఇన్‌ఫర్మేషన్ స్లిప్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపర్చింది. విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బీటెక్ సీట్ల కోసం పేపర్–1ను జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో బీఆర్క్ సీట్లకు పేపర్ – 2 పరీక్ష జనవరి 30న మధ్యాహ్నం నిర్వహిస్తుంది. త్వరలోనే జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల చేయనుంది.
త్వరలో నీట్ పరీక్షల తేదీ..
ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( NEET UG) 2025 పరీక్ష తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష సిలబస్‌ను https://www.nmc.org.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా నీట్ యూజీ సిలబస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. Nఉఉఖీ 2025 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2025, మే మొదటివారంలో నిర్వహించే అవకాశంది. బహుశా మే 6వ తేదీన నిర్వహిస్తుందని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నెలాఖరులోపు తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.