Ram Charan : రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం జనవరి 10వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన పాటలను, మిగిలిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉన్నారు మేకర్స్. నేడు ఈ చిత్రం లోని నాల్గవ పాట ‘డోప్’ వీడియో సాంగ్ ప్రోమో ని విడుదల చేసారు. ఈ ప్రోమో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రామ్ చరణ్, కైరా అద్వానీ వేసుకున్న కాస్ట్యూమ్స్ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ధరించిన జాకెట్ చూసేందుకు చాలా వెరైటీ గా అనిపించింది. వివిధ రకాల ప్రైజ్ ట్యాగ్స్ ఆ జాకెట్ మీద ఉన్నాయి. అదే విధంగా కైరా అద్వానీ రోజ్ కలర్ కాస్ట్యూమ్ తో చాలా కొత్తగా కనిపించింది. ప్రోమో చూస్తున్నంతసేపు, ప్రతీ ఫ్రేమ్ లో శంకర్ మార్కు కనిపించింది.
అయితే అభిమానులు తమ అభిమాన హీరో ధరించిన దుస్తులు ఆన్లైన్ లో దొరుకుతాయో, లేవో చూడకుండా ఉండరు కదా. ఈ ప్రోమో సాంగ్ వచ్చిన వెంటనే అభిమానులు ఆ జాకెట్ కోసం వెతకగా, దాని ప్రైజ్ ని చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఈ జాకెట్ ని కొనాలంటే ఆరు లక్షల రూపాయిలు చేతిలో ఉండాల్సిందే. సామాన్యులు ఇలాంటి వాటిని కొనుగోలు చేయడం అసాధ్యం. కేవలం రామ్ చరణ్ రేంజ్ హీరోలు మాత్రమే ఇలాంటివి వేసుకోగలరు. అయినప్పటికీ డబ్బులు ఎక్కువై కొనుక్కోవాలి అనుకునోళ్లు కొనుక్కోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ‘జరగండి..జరగండి’ పాటలో కూడా రామ్ చరణ్ ఇవే రేంజ్ వెరైటీ కాస్ట్యూమ్స్ ని ధరించాడు. వాటి విలువ కూడా భారీ రేంజ్ లో ఉంటాయి. మొత్తం మీద ఈ సినిమాలోని పాటల్లో రామ్ చరణ్ వాడిన కాస్ట్యూమ్స్ ధరలు మొత్తం కలిపితే కోటి రూపాయిల వరకు ఉండొచ్చు. శంకర్ సినిమా అంటే హీరోకి ఆ మాత్రం ఉంటుంది మరి.
ఇది ఇలా ఉండగా ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఇప్పటికే మొదలయ్యాయి. 22 రోజుల ముందే ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం కలిపి 3 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కేవలం నార్త్ అమెరికా నుండి ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది. రోజురోజుకి షోస్ ని పెంచుకుంటూ పోయే కొద్దీ ఈ చిత్రానికి గ్రాస్ వసూళ్లు తారాజువ్వ లాగా దూసుకొని పోతుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రానికి కేవలం నార్త్ అమెరికా నుండి మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి ఆ రేంజ్ ని ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి. 21 వ తారీఖున డల్లాస్ ప్రాంతం లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని చేయబోతున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ తర్వాత నార్త్ అమెరికా బుకింగ్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.