https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు వాయిస్ కి కోట్ల రూపాయిల బిజినెస్..హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్న టికెట్స్..ఇదేమి క్రేజ్ బాబోయ్!

తెలుగు వెర్షన్ లో 'ముఫాసా' క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పాల్సిందిగా డిస్నీ సంస్థ మహేష్ బాబు ని కోరింది. మహేష్ బాబు కూడా అంత పెద్ద సంస్థ అడిగేలోపు కాదు అనలేక ఈ క్యారక్టర్ కి వాయిస్ ఓవర్ ని అందించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 18, 2024 / 08:23 PM IST

    Mahesh Babu Voice

    Follow us on

    Mahesh Babu : ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా, గ్లోబల్ వైడ్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్నటువంటి పాపులారిటీ, క్రేజ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమాతో ఎలాగో ఆయన ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి కూడా అడుగుపెడతాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే హాలీవుడ్ కి చెందిన డిస్నీ సంస్థ మహేష్ క్రేజ్ ని పసిగట్టింది. డిస్నీ సంస్థ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఈ నెల 20 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తెలుగు వెర్షన్ లో ‘ముఫాసా’ క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పాల్సిందిగా డిస్నీ సంస్థ మహేష్ బాబు ని కోరింది. మహేష్ బాబు కూడా అంత పెద్ద సంస్థ అడిగేలోపు కాదు అనలేక ఈ క్యారక్టర్ కి వాయిస్ ఓవర్ ని అందించాడు.

    తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ లో ముఫాసా క్యారక్టర్ కి మహేష్ ఇచ్చిన వాయిస్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. రాజమౌళి తో సినిమా కాబట్టి మరో మూడేళ్లు మహేష్ బాబు ని వెండితెర మీద చూసేందుకు వీలు లేదు. ఈ గ్యాప్ లో మహేష్ వాయిస్ ఓవర్ అందించిన ఈ ‘ముఫాసా’ చిత్రాన్ని మహేష్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ లాగా జరపాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పలు సెలెక్టివ్ థియేటర్స్ లో ఈ చిత్రానికి స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేసారు. మహేష్ బాబు సినిమాలకు అడ్డాగా పిలవబడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో సెలెబ్రేషన్స్ వేరే లెవెల్ లో చెయ్యాలని ఏర్పాట్లు చేసుకున్నారు మహేష్ బాబు అభిమానులు. థియేటర్ మొత్తాన్ని ఇప్పటికే మహేష్ బాబు బ్యానర్స్ నింపేశారు. విడుదల రోజు బాణ సంచా, కేక్ కట్టింగ్స్ చేసి సంబరాలు చేసుకోనున్నారు ఫ్యాన్స్.

    కాసేపటి క్రితమే సుదర్శన్ థియేటర్ లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభిస్తే, రెప్పపాటు సమయంలోనే టికెట్స్ ని హాట్ కేక్స్ లాగా కొనుగోలు చేసారు మహేష్ ఫ్యాన్స్. అంతే కాదు ఈ స్పెషల్ షో లో ప్రారంభానికి ముందు మూడు మహేష్ బాబు పాటలు, సినిమా పూర్తి అయ్యాక మరో మూడు సాంగ్స్ ని ప్లే చేయబోతున్నారట. ఈ పాటలకు మహేష్ అభిమానులు భూమి బాదలయ్యే రేంజ్ సంబరాలు చెయ్యనున్నారు. తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో బాగా జరిగాయి. బుక్ మై షో యాప్ లో ఇప్పటి వరకు లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయాయట. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజు కచ్చితంగా ఈ చిత్రానికి పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.