Homeవైరల్ వీడియోస్Viral video : డబ్బులు ఎక్కువ అయ్యాయా రా బై .. అలా విసిరేస్తున్నారు! వైరల్‌...

Viral video : డబ్బులు ఎక్కువ అయ్యాయా రా బై .. అలా విసిరేస్తున్నారు! వైరల్‌ వీడియో

Viral video :  ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్లు చేతిలో ఉండి.. అందులో ఇంటర్నెట్‌ డేటా ఉంటే చాలా మంచి లొకేషన్‌ కనబడగానే ఫొటో దిగడం లేదా.. రీల్స్‌ చేయడం కామన్‌ అయిపోయింది. ఇక కొందరు రీల్స్‌ కోసమే లొకేషన్స ఎంచుకుంటున్నారు. దీంతో చాలా మంది టాలెంట్‌ వెలుగులోకి వస్తోంది. అయితే కొందరు చేసే రీల్స్‌తో వారు ప్రమాదంలో పడుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌ ఓ వ్యక్తి ఫ్లై ఓవర్‌ పైనుంచి డబ్బులు కిందకు విసిరి రీల్‌ చేశాడు. డబ్బులు ఎవరికీ ఫ్రీగా రావు. కష్టపడి సంపాదించిన వారికే వాటి విలువ తెలుస్తుంది. కానీ, తాతలు, దండ్రులు సంపాదించినడబ్బులను కొందరు వృథా చేస్తున్నారు. రీల్స్‌ పేరుతో వెదజల్లుతున్నారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు. పనిచేస్తేనే వస్తాయి. కష్టపడినవారు ఇలా డబ్బులు వృథాగా పడేయరు. ఫ్లై ఓవర్‌ పైనుంచి చల్లిన డబ్బులతో చాలా మంది గుమికూడారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చాలా మంది ఇబ్బంది పడ్డారు.

తాజాగా ఓఆర్‌ఆర్‌పై..
తాజాగా ఓ వ్యక్తి ఓఆర్‌ఆర్‌పై కరన్సీ నోట్లు వెదజల్లాడు. రూ.200 నోట్ల కట్టలు విసిరేశాడు. ఘట్‌కేసర్‌ సమీపంలో ఇలా డబ్బుల కట్టలు విసిరేశాడు. రోడ్ల పక్కన చెట్లపై కి విసిరాడు. దీనికి సబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. తర్వాత అది వైరల్‌ కావడంతో పోలీసులకు చేరింది. పోలీసులు ఘటన స్థలం పరిశీలించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

గతంలో యూట్యూబర్‌..
గతంలో ఓ యూట్యూబర్‌ కూడా కరెన్సీ నోట్లను గాల్లోకి ఎగరేశాడు. ఏకంగా రూ.50 వేల నోట్లు పైకి విసిరాడు. దీంతో జనాలు రోడ్డుపై ఎగబడ్డారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేట్‌ కోసం ఇలా చేయడంపై మండిపడుతున్నారు. ఓ నెటిజర్‌ రిప్లై ఇచ్చాడు. ఇలా చేయడం సరికాదని, తెలివి తక్కువ పని అని మండిపడ్డాడు. రోడ్డుపై న్యూసెన్స్‌ చేసేవారిని అరెస్టు చేయాలని కోరుతున్నారు. కొందరు ఇలా పడేసే డబ్బుతో పేదల ఆకలి తీర్చవచ్చని, ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి వారిని జైలుకు పంపాలని కోరుతున్నారు.

Telugu Youtuber Bhanu Chander Cheap Tricks for Youtube Views |@SakshiTV

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version