Mirai Movie Collections: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోలు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే మిరాయి సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకోవడంతో ఈ సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చూస్తున్నా తేజ సజ్జా ఈ మూవీ తో స్టార్ హీరోలు అందరికి తను పోటీని ఇవ్వబోతున్నాను అంటూ ఈ సినిమాతో చెప్పకనే చెప్పాడు. మరి ఏది ఏమైనా కూడా వరుసగా హనుమాన్, మిరాయి లాంటి రెండు గొప్ప సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇక మీదట కూడా మంచి సినిమాలు చేయడానికి పూనుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ప్రస్తుతం ఆయన మాస్ సినిమాలను కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
ఇక రెండు సినిమాలు కూడా దేవుళ్ళకి సంబంధించినవే కావడం అది కూడా ఆధ్యాత్మికమైన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇక మీదట మాస్ సినిమాలను కూడా అదే రేంజ్ లో చేసి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read: ‘మిరాయి’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా?ఫట్టా?
మిరాయి సినిమా కనక 500 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడినట్లైతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ అప్పులు మొత్తం తీరిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి తేజ వరుసగా హనుమాన్ సినిమాతో 400 కోట్ల కలెక్షన్లు కొలబడ్డాడు ఈ సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టినట్లయితే ఆయన టైర్ వన్ హీరోగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి…
ఇప్పటికే ఆయన మీడియం రేంజ్ హీరోలందరిని దాటేసి ఆయన టాప్ పొజిషన్ కి చేరుకుంటున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరమైతే ఉంది. తేజ సజ్జ ఇక మీదట కూడా మంచి విజయాలను సాధించాల్సిన అవసరం అయితే ఉంది ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా ఆయన చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…