CBN vs ABN: తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నప్పుడు యూరియా కొరత విపరీతంగా ఉండడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరికి ప్రస్తుత తరుణంలో యూరియా చాలా అవసరం ఉంటుంది. మిగతా పంటలకు కూడా యూరియా అదే స్థాయిలో అవసరం. అయితే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా కాకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలకు దిగుతున్నారు. చివరికి పోలీసుల సమక్షంలో యూరియా సరఫరా చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
రకరకాల కారణాల వల్ల యూరియా తగినంత స్థాయిలో ఉత్పత్తి కావడం లేదని తెలుస్తోంది. అందువల్లే డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై కావడం లేదని సమాచారం. పైగా ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు పంటలు విస్తారంగా సాగయ్యాయి. ఆ పంటలు కూడా ఏపుగా ఉన్నాయి. ఇలాంటి దశలో సక్రమంగా యూరియా సరఫరా కాకపోవడం పంటల దిగుబడి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. అరకొరగా సరఫరా అవుతున్న యూరియాను రైతులకు అధికారులు దగ్గరుండి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యూరియా కొరతకు సంబంధించి మీడియా రకరకాలుగా వార్తలను ప్రసారం చేస్తోంది. అయితే ఏపీలో కూడా యూరియా కొరత ఉండడంతో.. అక్కడి ప్రభుత్వానికి అనుకూల మీడియాగా పేరుపొందిన ఓ ఛానల్లో కూడా యూరియా కష్టాలపై వార్తలు ప్రసారమవుతున్నాయి. గడచిన 15 సంవత్సరాలలో ఎన్నడు కూడా ఇటువంటి దారుణాన్ని చూడలేదని నా ఛానల్ లో పనిచేస్తున్న ప్రధాన జర్నలిస్టు వ్యాఖ్యానించారు. దేశంలో 70% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉందని.. ఇంతకంటే పెద్ద పరిశ్రమ ఇంకా ఎక్కడ ఉంటుందని.. అలాంటిది రైతులకు సక్రమంగా యూరియా సరఫరా చేయకపోవడం ఏంటని ఆ ప్రధాన జర్నలిస్టు ప్రశ్నించారు. రైతుల కోసం గొప్ప గొప్ప పనులు చేస్తామని చెప్తున్న నాయకులు చివరికి యూరియా కూడా సరఫరా చేయాలని దుస్థితిలో ఉన్నారని ఆ జర్నలిస్టు ప్రశ్నించారు. ఆయన ప్రశ్నించిన మాటలకు సంబంధించిన వీడియోను వైసిపి నాయకులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వాన్ని అనుకూలంగా ఉండే మీడియా ఛానల్ కూడా ప్రశ్నిస్తోందని.. దీనికి కూటమి నాయకులు ఏ విధంగా సమాధానం చెప్తారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఒక యూరియా కథ!!!
CBN vs ABN !!! pic.twitter.com/8jW9rm3KT2— Samosa Times (@Samotimes2026) September 11, 2025