Mirai Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ‘హనుమాన్’ సినిమాతో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్న తేజ సజ్జా ప్రస్తుతం మిరాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు…ఇక ఆయన చేసిన ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాల్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: ‘మిరాయ్’ ట్విట్టర్ టాక్..ప్రభాస్ ఎంట్రీ కి సెన్సేషనల్ రెస్పాన్స్..సినిమా హిట్టా? ఫట్టా?
కథ
వేద(తేజ సజ్జా) అనే వ్యక్తి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి ఫస్ట్ కాపీలను తయారు చేస్తూ ఉంటాడు. ఇక దాంతోపాటుగా బ్లాక్స్వర్డ్ (మంచు మనోజ్) అనే వ్యక్తి అశోకుడు క్రియేట్ చేసిన 9 గ్రంథాలను స్వాధీనం చేసుకొని ప్రపంచాన్ని ఏలయ్యాలి అనే కాన్సెప్ట్ తో ఉంటాడు. ఇందులోకి వేద ఎలా ఎంటరయ్యాడు…మరి వీళ్లిద్దరి మధ్య ఇలాంటి పోటీ జరిగింది అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా డివియెట్ అవ్వకుండా ఒకే కాన్సెప్ట్ ను తెర మీద చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇక సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల వరకు సినిమాలో పెద్దగా కాన్ఫ్లిక్ట్ అయితే ఏమీ ఉండదు. కొంతవరకు బోర్ కొట్టించే అంశాలు వచ్చినప్పటికి 40 నిమిషాల తర్వాత సినిమా అనేది ఊపొందుకుంటుంది. అసలు ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా ప్రతి పాయింట్ ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించి ప్రేక్షకులు చేత శభాష్ అనిపించుకున్నాడు.
ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్ లో దడదడలాడించాడు. ఎక్కడా కూడా ఒక్క డౌన్ పాయింట్ లేకుండా టాప్ లో నిలిపాడనే చెప్పాలి… ఇక సినిమాలోని సిచువేషన్ కి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంది. ప్రతి సీను ఎలివేట్ అవ్వడానికి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా వరకు హెల్ప్ అయింది. మరి మొత్తానికైతే ఈ సినిమాలోని ఎమోషన్ ని ఎలివేషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ కార్తీక్ ఘట్టమనేని ఒక పవర్ ప్యాక్ సినిమా అయితే చేశాడనే చెప్పాలి… ఇక తేజ సజ్జా క్యారెక్టరైజేషన్ ని కూడా చాలా బాగా రాసుకున్నాడు.
అలాగే మంచు మనోజ్ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ ని చూపించే విధంగా రైటింగ్ లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు…కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న పాయింట్ లో చాలా స్టొరీ అయితే ఉంది. ఆ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉండడంతో ప్రతి సీన్ కూడా కొత్తగా రాసుకోవాలనే ప్రయత్నం అయితే చేశాడు. సినిమా మొత్తం ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చుతోంది. సినిమా చూసొచ్చిన తర్వాత కూడా మన మైండ్లో ఆ బిజిఎం మెదులుతోంది అంటే అది ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికొస్తే తేజ సజ్జా మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. హనుమాన్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాడనే చెప్పాలి. మిరాయి అనే కాన్సెప్ట్ తేజ సజ్జా తప్ప వేరే వాళ్లు ఎవరు చేయలేరు అనే అంతగా గుర్తింపును సంపాదించి పెట్టుకున్నాడు…ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తేజ చాలా అద్భుతంగా నటించాడు. నిజంగా ఆ పాత్రలో జీవించడనే చెప్పాలి. ఇక విలన్ గా మంచు మనోజ్ సైతం ఒక స్ట్రాంగ్ విలనిజాన్ని చూపించే ప్రయత్నం చేశాడు… శ్రేయ పాత్ర చాలా అద్భుతంగా ఉంది. సినిమా మొత్తానికి సోల్ తన పాత్రే సోల్ అని చెప్పాలి…జగపతిబాబు పాత్ర కూడా ఒకే అనిపించింది…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా కుదిరింది. గౌరహరి ఇచ్చిన బ్యా గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ప్లస్ అయింది. ప్రతి సీన్ ని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ కీలకపాత్ర వహించింది… ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ లో విజువల్స్ ని చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే సీజీ వర్క్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంత తక్కువ బడ్జెట్ లో చేసిన కూడా సిజి వర్క్ చాలా బాగా చేశారు…
ప్లస్ పాయింట్స్
కథ
తేజ సజ్జా
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ కొంచెం బోర్ కొట్టింది…
కొన్ని అనవసరమైన సీన్స్…
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.75/5