Sandeep Reddy Vanga and Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సమయంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…మరి ఏది ఏమైనా కూడా వాళ్లు చేయబోతున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తే ఇక్కడ ఎక్కువ కాలం పాటు హీరోలుగా కొనసాగే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క సినిమా కూడా వాళ్లకు చాలా కీలకమనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిద్య భరితమైన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ(Sandeep Reddy Vanga)…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఆయన తన తదుపరి సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. అనిమల్ (Animal) సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఆయన ఇప్పుడు ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయబోతున్నాడు. అయితే అనిమల్ (Animal) సినిమా వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికి ఇంకా కూడా స్పిరిట్ సినిమా సెట్స్ మీదకి అయితే వెళ్ళలేదు.
కారణం ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే బౌండేడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఉన్నప్పటికి ప్రభాస్ మాత్రం ఫౌజీ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించడంతో ఆ సినిమా పూర్తయిన తర్వాత స్పిరిట్ సినిమా మీద తన డేట్స్ ను కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదిలా ఉంటే పౌజీ సినిమా షూటింగ్ రెగ్యూలర్ గా జరుగుతుందా అంటే అది లేదు ఇప్పుడు ప్రభాస్ కి కొన్ని గాయాలు అవ్వడం వల్ల ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
మరి వాటికి సంబంధించిన సర్జరీస్ కూడా చేస్తే ఆయన్ షూట్ కి రావడానికి మరిన్ని రోజులు లేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. తద్వారా సందీప్ రెడ్డివంగా ఒక సినిమాని సంవత్సరం లో తెరకెక్కిస్తాడు. ఈ లెక్కన ఇప్పటికే అనిమల్ సినిమా రిలీజ్ అయి సంవత్సరం పూర్తయింది. ఇప్పటికే స్పిరిట్ సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు. ఇక సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ సినిమా ఆల్మోస్ట్ సంవత్సరం వరకు రిలీజ్ అయితే అవ్వదు.
ఈ లెక్కన సందీప్ రెడ్డి వంగ ఈ సంవత్సరం కూడా థియేటర్ లోకి రాలేడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆయన 2026 ఎండింగ్ లో కానీ లేదంటే 2027 స్టార్టింగ్ లో గాని థియేటర్ లోకి వచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇన్ని రోజుల పాటు ప్రభాస్ కోసం ఆయన వెయిట్ చేస్తాడా? లేదంటే ఈ గ్యాప్ లో మరొక హీరోతో ఒక మంచి సినిమాని చేస్తాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది…