Game Changer and Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ని మన ఇండియన్ మూవీ లవర్స్ ఇప్పట్లో మర్చిపోలేరు. ‘పుష్ప’ అనే క్యారక్టర్ ని వందేళ్ల ఇండియన్ సినిమా చిత్రాల్లో మోస్ట్ ఐకానిక్ రోల్ గా మార్చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో ఆయన మ్యానరిజం ని అనుసరించని వాళ్ళు ఇండియా లో ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఎట్టి పరిస్థితిలోను 2000 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేర్చాలనే కసితో ఉన్నారు మేకర్స్. అందుకే లేటెస్ట్ గా రీ లోడెడ్ వెర్షన్ అంటూ, ఈ చిత్రం ఎడిటింగ్ సమయంలో నిడివి ని దృష్టిలో పెట్టుకొని తొలగించబడ్డ 20 నిమిషాల సన్నివేశాలను జత చేస్తూ విడుదల చేసారు.
రెస్పాన్స్ అదిరిపోయింది..ఇంత అద్భుతమైన సన్నివేశాలను ఎందుకు తొలగించారు రా అంటూ మూవీ టీం ని ట్యాగ్ చేసి అల్లు అర్జున్ అభిమానులు తిడుతున్నారు. అనేక ప్రాంతాల్లో నేడు ఈ రీ లోడెడ్ వెర్షన్ కి హౌస్ ఫుల్స్ పడగా, బుక్ మై షో యాప్ లో గంటకి రెండు వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. 40 రోజుల తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా బంపర్ రెస్పాన్స్ ని చూపించిన ఈ సినిమాని చూసి ట్రేడ్ పండితులు సైతం నివ్వెరపోయారు. వారం రోజుల క్రితం విడుదలై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రానికి ప్రస్తుతం గంటకు 1500 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా అదే స్థాయి ట్రెండ్ నడుస్తుంది. పుష్ప 2 ఈ రెండు సినిమాలను అధిగమించడం అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం.
కొత్త సన్నివేశాలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మరో మూడు వారాలు ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి ఈ రీ లోడెడ్ వెర్షన్ ని విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల వారం రోజులు వాయిదా వేశారు. అలా చేసి మంచి పని చేసారు, లేకుంటే కొత్త సినిమాలను కూడా ఈ చిత్రం డామినేట్ చేసేది. ఎప్పుడో మన చిన్నతనం లో చూసేవాళ్ళం ఇలాంటి లాంగ్ రన్ ఉండే సినిమాలను. మళ్ళీ ఇన్నాళ్లకు పుష్ప 2 కి చూస్తున్నాం. ఓటీటీ కాలంలో ఒక సినిమాకి ఇంతటి లాంగ్ రన్ రప్పించడం కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే సాధ్యమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి.