Pushpa 2
Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన సినిమాల్లో పుష్ప 2(Pushpa 2) ఒకటి…ఇక రాజమౌళి బాహుబలి 2 (Bahubali 2) సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ఇక ఇప్పుడు బాహుబలి 2 సినిమా రికార్డు ను కూడా బ్రేక్ చేసి పుష్ప 2 సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా వైల్డ్ గా కనిపించడమే కాకుండా ఈ సినిమాలో తన హీరోయిజం మొత్తాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడి మరి సినిమాలోని సీన్స్ ను రాసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈరోజే ఈ సినిమాకు సంబంధించిన రీ లోడెడ్ వెర్షన్ ని ఆడ్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా దంగల్ (Dangal) సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసే దిశగా ముందుకు సాగుతుందనేది వాస్తవం. ఒకవేళ దంగల్ సినిమా రికార్డును బ్రేక్ చేసినట్లయితే పుష్ప 2 మూవీ ఇండస్ట్రీ హిట్టుగా కన్వర్ట్ అవ్వడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచిన సినిమాగా ఈ సినిమా మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. మరి ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తూ భారీ రికార్డులను కొల్లగొడుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న పుష్ప 2 సినిమా సక్సెస్ మీద సుకుమార్ అంత సంతృప్తిగా లేనట్టుగా తెలుస్తోంది.
కారణం ఏంటి అంటే పుష్ప 2 రిలీజ్ రోజున రేవతి అనే మహిళ మృతి చెందడం పట్ల ఆయన సినిమా సక్సెస్ ని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నారనేది వాస్తవం… అందువల్లే ఈ సినిమా విషయాలను తెలుసుకోవడానికి కూడా ఆయన పెద్దగా ఇష్టపడడం లేదట.
మరి కారణం ఏదైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా గౌరవాన్ని పెంచడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని మరోసారి పెంచిందనే చెప్పాలి… ఇక ఇప్పుడు ఆయన రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక మంచి విజయాన్ని సాధించి మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోబోతుందనేది…