Vantalakka: మన వంటలక్క కొడుకు ఎలా ఉన్నాడు? ఎంత ఉన్నాడో చూస్తారా? వైరల్ వీడియో

వంటలక్క పాత్రలో ప్రేమి విశ్వనాథ్ పడే కష్టాలు చూడలేక ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునేవారు. అచ్చు తెలుగు గృహిణిలా కనిపించే ప్రేమి విశ్వనాథ్ కేరళకు చెందిన నటి. ఆమె పలు మలయాళ సీరియల్స్ లో నటించారు.

Written By: NARESH, Updated On : December 17, 2023 5:48 pm

Vantalakka

Follow us on

Vantalakka: కార్తీక దీపం సీరియల్స్ లో రారాజు. ఈ డైలీ సీరియల్ నమోదు చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఏళ్ల తరబడి జనాలు విసుగు లేకుండా చూశారు. ఈ సీరియల్ ప్రధానంగా మూడు పాత్రల మధ్య నడుస్తుంది. ఒకటి వంటలక్క, రెండు డాక్టర్ బాబు, మూడు మోనిత. వంటలక్క అలియాక్ దీప పాత్ర చేసింది ప్రేమి విశ్వనాథ్. ఈమెకు ఓ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె ఒక సూపర్ స్టార్. తన నటనతో ఆడియన్స్ ని కట్టిపడేసేది.

వంటలక్క పాత్రలో ప్రేమి విశ్వనాథ్ పడే కష్టాలు చూడలేక ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునేవారు. అచ్చు తెలుగు గృహిణిలా కనిపించే ప్రేమి విశ్వనాథ్ కేరళకు చెందిన నటి. ఆమె పలు మలయాళ సీరియల్స్ లో నటించారు. కార్తీక దీపం సీరియల్ తో తెలుగులో పాప్యులర్ అయ్యారు. కార్తీక దీపం సీరియల్ లో నిరుపమ్ హీరోగా నటించగా, విలన్ మోనిత పాత్ర శోభ శెట్టి చేసింది.

ఈ సీరియల్ 2017లో మొదలై 2023 జనవరిలో ముగిసింది. కొన్నాళ్ళు డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు లేకుండా సీరియల్ నడిపించారు. వారు ప్రమాదంలో మరణించినట్లు కథ మార్చారు. అయితే వంటలక్క పాత్ర లేని ఆ సీరియల్ ని జనాలు ఊహించుకోలేకపోయారు. ఆ దెబ్బతో మరలా ప్రేమి విశ్వనాథ్ ని తెరపైకి తెచ్చారు.

కార్తీక దీపం ముగిశాక ప్రేమి విశ్వనాథ్ తెలుగులో కనిపించడం లేదు. అయితే ఆమె సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. తాజాగా కొడుకుతో కలిసి ఆమె ఓ డాన్స్ వీడియో చేశారు. అది ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రేమి విశ్వనాథ్ కొడుకు జిమ్ బాడీలో సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు. సదరు వీడియో చూసిన జనాలు ప్రేమి విశ్వనాథ్ కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అని వాపోతున్నారు. ప్రేమి విశ్వనాథ్ బాగా డబ్బున్న ఆర్టిస్ట్ అట. కేరళలో ఆమెకు స్టూడియో కూడా ఉందని సమాచారం. ఇటీవల ఆమె కస్టడీ మూవీలో కీలక రోల్ చేయడం విశేషం.