https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: డబ్బు తీసుకోమని అమర్ కి హింట్ ఇచ్చిన భార్య తేజస్విని… సెన్సేషన్ గా మారిన వీడియో

డిసెంబర్ 14న అమర్ దీప్ పెళ్లి రోజు సందర్భంగా అతని భార్య తేజు తో వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పించారు బిగ్ బాస్. కాగా అమర్ యాక్టివిటీ ఏరియాలో తేజస్విని తో వర్చువల్ వీడియో కాల్ మాట్లాడాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2023 / 05:52 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నేటితో ముగియనుంది. కాగా ఇందుకు సంబంధించిన గ్రాండ్ ఫినాలే షూట్ కూడా పూర్తయింది. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ లో నలుగురు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు అని తెలిసింది. అర్జున్, ప్రియాంక, యావర్, శివాజీ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ టాప్ 2 లో నిలిచారు. ఈ నేపథ్యంలోనే అమర్ దీప్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

    డిసెంబర్ 14న అమర్ దీప్ పెళ్లి రోజు సందర్భంగా అతని భార్య తేజు తో వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పించారు బిగ్ బాస్. కాగా అమర్ యాక్టివిటీ ఏరియాలో తేజస్విని తో వర్చువల్ వీడియో కాల్ మాట్లాడాడు. ఆ సమయంలో ఆమె పెదాలు కదుపుతూ ఏదో మాట్లాడింది. దీంతో అందరూ ‘ బ్యాగ్ తీసుకో ‘ అని ఆమె చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే సీజన్ 7 చివరి దశకు చేరుకున్న తర్వాత పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిస్తాడని ప్రచారం సాగింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు అతడు అమర్ దీప్ తో కలిసి టాప్ 2 లో నిలవడంతో ప్రశాంత్ గెలుపు ఖాయం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తేజు ..అమర్ కి డబ్బు తీసుకోమని హింట్ ఇచ్చినట్లు వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది.

    ఇది ఇలా ఉండగా .. నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కాబోతుంది. దీంతో స్పెషల్ ఎపిసోడ్ ని ఎంతో సందడిగా ప్లాన్ చేశారు. దీని కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్ప్రైజ్ లు ప్లాన్ చేసారని సమాచారం. ఈ ఉల్టా పుల్టా సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని ఇప్పటికే తెలిసిపోయింది. దీంతో ప్రశాంత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా నేడు ఫినాలే ఎపిసోడ్ లో విన్నర్ ని ప్రకటించనున్నారు.