https://oktelugu.com/

Shilpa Chaudhary: ‘కిలాడి’ శిల్పా చౌదరి ఇలా మారిపోయిందెంటీ?

Shilpa Chaudhary: గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో శిల్పా చౌదరి పేరు బాగా విన్పిస్తోంది. టాలీవుడ్ సెలబ్రెటీలు, ఇతర ప్రముఖులను బురిడీ కొట్టించి కోట్లకు కోట్లను ఎగబెట్టారనే ఆరోపణలను శిల్పా చౌదరి ఎదుర్కొంటోంది. కిట్టి పార్టీల పేరుతో వీఐపీలను పరిచయం చేసుకొని ఆ తర్వాత మాయమాటలతో శిల్పాచౌదరి చేస్తుందని పోలీసులు తేల్చారు. దీంతో ఆమె చేతిలో మోసపోయిన బాధితులంతా పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. శిల్పా చౌదరి బాధితుల లిస్టులో సూపర్ స్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 13, 2021 / 12:01 PM IST
    Follow us on

    Shilpa Chaudhary: గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో శిల్పా చౌదరి పేరు బాగా విన్పిస్తోంది. టాలీవుడ్ సెలబ్రెటీలు, ఇతర ప్రముఖులను బురిడీ కొట్టించి కోట్లకు కోట్లను ఎగబెట్టారనే ఆరోపణలను శిల్పా చౌదరి ఎదుర్కొంటోంది. కిట్టి పార్టీల పేరుతో వీఐపీలను పరిచయం చేసుకొని ఆ తర్వాత మాయమాటలతో శిల్పాచౌదరి చేస్తుందని పోలీసులు తేల్చారు. దీంతో ఆమె చేతిలో మోసపోయిన బాధితులంతా పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

    Shilpa Chaudhary

    శిల్పా చౌదరి బాధితుల లిస్టులో సూపర్ స్టార్ మహేశ్ బాబు చెల్లెలు, యువ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని, ఓ యువ హీరో కూడా ఉన్నట్లు తేలింది. వీరి నుంచి పెట్టుబడుల కోసం పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరికి ఎక్కువ వడ్డీ ఆశజూపి డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శిల్పాచౌదరి లీలాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తుండటంతో ప్రముఖలంతా ఖంగుతింటున్నారు.

    తాజాగా పోలీసులు శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ లను విచారించగా పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని సహా వందల మందిని మోసం చేసిన ఈ జంట పోలీస్ కస్టడీలో కొత్త ప్రపోజల్స్ తీసుకొచ్చారని తెలుస్తోంది. బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించేందుకు శిల్పా చౌదరి అంగీకరించినట్లు సమాచారం. కాగా వీరిద్దరి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన పోలీసులకు షాక్ కొట్టినంత పనైంది

    ప్రస్తుతం శిల్ప బ్యాంక్ ఖాతాలో రూ.16 వేలు, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ అకౌంట్ లో రూ.14వేలు మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  విచారణ సందర్భంగా శిల్పా చౌదరి నుంచి కీలక విషయాలను రాబట్టిన పోలీసులు కోట్లాది రూపాయాల సొమ్మును ఎటు తరలించారనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు మరింత గడువు కోరే అవకాశం కన్పిస్తోంది. కాగా కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియడంతో నేడు వీరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

    శిల్పా చౌదరి అమెరికాలో ఓ సాప్ట్ కంపెనీలో ఉద్యోగం చేసి మానేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అమెరికా నుంచి తిరిగొచ్చాక ప్రముఖులతో పరిచయాలు పెంచుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. మహేష్ బాబు సోదరి సహా మూడు కేసుల్లో రూ.7కోట్లకుపైగా తీసుకుని ఎగ్గొట్టగా.. రాధికారెడ్డికి రూ.10 కోట్లకుపైగా ఇచ్చినట్లు పోలీసులతో వాదించిన శిల్పా అందుకు తగిన ఆధారాలను చూపించలేకపోయింది.

    Also Read: Miss Universe: మిస్ యూనివర్స్​గా హర్నాజ్​.. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాను వరించిన మకుటం

    ఈక్రమంలోనే పోలీసులు శిల్పా మోసాలపై మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. శిల్పా సేకరించిన కోట్లాది రూపాయాలు ఎటూ వెళ్లాయో తేలకపోవడంతో ఆమెను మరోసారి రిమాండ్ కోరే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటిదాకా సాగిన దర్యాప్తులో శిల్పాచౌదరి రూ.32కోట్ల వరకు మోసం చేసినట్లు నార్సింగ్ పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా ఒకప్పుడు సినీ తారలా వెలిగిపోయిన శిల్పా చౌదరి గత నెల 27న అరెస్టయింది. రెండు వారాల కస్టడీ తర్వాత సినీ తారలా ఉంటే శిల్పా చౌదరి గుర్తుపట్టలేనంతగా మారిపోవడం గమనార్హం.

    Also Read: Celebratie Siblings: టాలీవుడ్ హీరో హీరోయిన్ల తోబుట్టువులు వీళ్లే..!