Venkatesh: వెంకటేష్ కి ఇండస్ట్రీలో మరో పేరు కూడా ఉంది. అదే రీమేక్ రాజా. వెంకీ తన కెరీర్ లో రాజా పేరుతో చాలా సినిమాలు తీశాడు. రాజా అని, బొబ్బిలి రాజా అని, అలాగే కొండవీటి రాజా అని ఇలా రాజా అనే పేరుకి వెంకీ పర్యాయపదం అయ్యాడు. అయితే ఎన్ని రాజాలు తన కెరీర్ లో ఉన్నా రీమేక్ రాజా అనే పేరు మాత్రం వెంకీకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఎందుకంటే వెంకటేష్ చేసిన సినిమాల్లో సగానికి పైగా రీమేక్సే ఉండటం విశేషం.
పైగా చేసిన ఆ రీమేక్స్ అన్నీ దాదాపుగా సూపర్ హిట్సే. ఒకవిధంగా వెంకటేష్ కి స్టార్ డమ్ రావడానికి కారణం కూడా ఆ రీమేక్సే. ఏ భాషలో ఏ మంచి సినిమా వచ్చినా వెంటనే సురేష్ ప్రొడక్షన్ కి సంబంధించిన వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయి రీమేక్ రైట్స్ కొనేస్తాడు. రీమేక్ లో చాలా వెసులుబాట్లు ఉంటాయి. కొన్ని సీన్స్ ను అలాగే యధాతధంగా వాడేస్తారు.
అలాగే స్క్రిప్ట్ విషయంలో ఎక్స్ ప్రెషన్స్ విషయంలో కూడా ముందుగానే క్లియర్ గా చాలా క్లారిటీ ఉంటుంది. ఇటు నటీనటులకు మరియు అటు డైరెక్టర్లకు రీమేక్ లో పొరపాట్లు చేయడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకే, వెంకటేష్ గత కొంతకాలంగా వరుసగా రీమేక్ లు చేసుకుంటూ పోతున్నారు. మరి ఒకసారి వెంకీ రీమేక్ ల లిస్ట్ చూద్దాం.
గోపాల – గోపాల, దృశ్యం, గురు, నారప్ప, దృశ్యమ్ 2.. ఇలా వెంకీ తెలుగు సినిమా పరిశ్రమలో రీమేక్ ల వర్షం కురిపిస్తున్నాడు. లాస్ట్ సినిమా నారప్ప అనుకున్న ఫలితాన్ని తీసుకురాకపోయినా.. వెంకీకి మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా విడుదలైన దృశ్యం 2కి పాజిటీవ్ స్పందన వస్తోంది కాబట్టి.. సినిమా హిట్ అయినట్టే. ఏ రకంగా చూసుకున్నా వెంకీకి రీమేక్ లు బాగా కలిసివచ్చాయి.
Also Read: Acharya: ‘ఆచార్య’ సినిమా ఓటీటీ రిలీజ్ అందులోనే?
రీమేక్ ల కారణంగా కలిగే మరో ఉపకారం ఏమిటంటే.. అతి తక్కువ బడ్జెట్ లో, సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ను పూర్తి చేయవచ్చు. పైగా చాలా సులభంగా తమ ఖాతాలో మరో సూపర్ హిట్ ను వేసుకోవచ్చు.
Also Read: Liger: యూఎస్‌లో ‘లైగర్’ షూటింగ్ పూర్తి.. వరుస అప్డేట్లకు మేకర్స్ సన్నాహాలు