Mahesh: సరికొత్త లుక్​లో మహేశ్​.. హాలీవుడ్​ సినిమానా అంటూ నెటిజన్లు కామెంట్​

Mahesh: టాలీవుడ్​లో అమ్మాయిల కలల రాకుమారుడు, ఆరుగుడుల అందగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది సూపర్​స్టార్​మహేశ్​ బాబు. ఎప్పుడూ ఏదో ఒక డిఫరెంట్​ లుక్​తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. సినిమాలోనే కాకుండా, ఆఫ్​లైన్​లోనూ సరికొత్త లుక్​తో కనిపించి.. కనువిందు చేస్తుంటారు మహేస్​. అలా గతంలో అనేక ఫొటోలు నెట్టింట్లో వైరల్​ అయ్యాయి. ఇప్పుడు అదే ఖాతాలో మరో ఫొటో చేరింది. Also Read: త్రివిక్రమ్​- మహేశ్​ కాంబినేషన్​ మూవీ షూటింగ్​ స్టార్ట్​ అప్పటినుంచే! ఖరీదైన ఓ బైక్​పై అదిరె అప్పియరెన్స్​తో […]

Written By: Raghava Rao Gara, Updated On : November 26, 2021 12:25 pm
Follow us on

Mahesh: టాలీవుడ్​లో అమ్మాయిల కలల రాకుమారుడు, ఆరుగుడుల అందగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది సూపర్​స్టార్​మహేశ్​ బాబు. ఎప్పుడూ ఏదో ఒక డిఫరెంట్​ లుక్​తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. సినిమాలోనే కాకుండా, ఆఫ్​లైన్​లోనూ సరికొత్త లుక్​తో కనిపించి.. కనువిందు చేస్తుంటారు మహేస్​. అలా గతంలో అనేక ఫొటోలు నెట్టింట్లో వైరల్​ అయ్యాయి. ఇప్పుడు అదే ఖాతాలో మరో ఫొటో చేరింది.

Mahesh

Also Read: త్రివిక్రమ్​- మహేశ్​ కాంబినేషన్​ మూవీ షూటింగ్​ స్టార్ట్​ అప్పటినుంచే!

ఖరీదైన ఓ బైక్​పై అదిరె అప్పియరెన్స్​తో ఫోన్​ పట్టుకుని కూర్చున్నారు మహేశ్​. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారింది. అసలు ఈ ఫొటో హాలీవుడ్​ సినిమాలోదా అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఫొటో ఓ అడ్​వర్టైజ్​మెంట్​లోదని సమాచారం.

కాగా, ప్రస్తుతం మహేశ్​ సర్కారువారిపాట సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించగా పలు కారణాల వల్ల ఏప్రిల్ కు మార్చారు. మరోవైపు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్​తో కలిసి మరో సినిమాను పట్టాలెక్కించనున్నారు మహేశ్. వీరిద్దరి కాంబోరో రానున్న హ్యాట్రిక్​ చిత్రం ఇది.

Also Read: ఒకే స్క్రీన్​పై ప్రభాస్​- మహేశ్​… థమన్ ట్వీట్​ వైరల్​!