Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 18: 'బిగ్ బాస్' హౌస్ నుండి తప్పించుకొని పారిపోయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్..గోడ ఎలా...

Bigg Boss 18: ‘బిగ్ బాస్’ హౌస్ నుండి తప్పించుకొని పారిపోయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్..గోడ ఎలా దూకుతున్నాడో చూడండి..వైరల్ అవుతున్న వీడియో!

Bigg Boss 18: బిగ్ బాస్ రియాలిటీ షో ఏ మనిషికి అయినా ఒక పెద్ద పరీక్ష అనే చెప్పాలి. జీవితం లో జరిగిన సంఘటనలు మొత్తం కేవలం హౌస్ లో ఉన్న ఆ మూడు నెలల్లో అనుభవించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, అలాంటి సంఘటనలు మనకి ఎదురైతే ఎలా ఉంటుందో?, చూసే ఆడియన్స్ బోలెడంత ఎంటర్టైన్మెంట్ దక్కుతుంది, కానీ హౌస్ లోపల కూర్చొని ఎంటర్టైన్మెంట్ అందించేవాడికి మాత్రం దూల తీరిపోతుంది అని చెప్పొచ్చు. ఆహరం సరిగా ఉండదు, నిద్రలేస్తే ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి. ఒక మనిషితో గొడవ పడితే అతనితో కొన్ని రోజులు అయిన తర్వాత మాట్లాడాలంటే మనం భయపడుతాము. కానీ హౌస్ ఇష్టమొచ్చినట్టు కొట్టుకుంటారు, ఆర్చుకుంటారు, మళ్ళీ పక్కరోజు ఈగోలను మొత్తం చంపుకొని వాళ్ళతోనే కలిసి మాట్లాడాలి, కలిసి గేమ్స్ కూడా ఆడాలి. ఈ ప్రక్రియ లో సదరు కంటెస్టెంట్ అనుభవించే మానసిక వేదన అంతా ఇంతా కాదు. అలాగే హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రపంచం తో సంబంధమే ఉండదు, ఫోన్ ఉండదు,టీవీ ఉండదు, బోర్ కొట్టినప్పుడు జుట్టు పీక్కోవాల్సిందే కానీ, మధ్యలో నిద్రపోవడానికి కూడా అనుమతి ఉండదు.

టాస్కులు చాలా కఠినమైనవి పెడుతారు, వాటిని ఆడేందుకు ఫిజికల్ గా చాలా బలంగా ఉండాలి, కానీ హౌస్ లో తినే మితమైన ఆహరం కారణంగా కంటెస్టెంట్స్ కి కావాల్సినంత బలం దొరకదు. దీంతో టాస్కులు ఆడే క్రమం లో క్రిందకు పడిపోతుంటారు, కొంతమందికి అయితే తీవ్రమైన గాయాలు కూడా అవుతుంటాయి. ఇన్ని భరించి మనమైతే రెండు రోజులు కూడా ఆ హౌస్ లో ఉండలేము ఏమో..!,నిజంగా నెలలు తరబడి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్లకు చేతులెత్తి దండం పెట్టేయొచ్చు. ఇదంతా పక్కన పెడితే కొంతమంది కంటెస్టెంట్స్ ఇలాంటివి తట్టుకోలేక నాగార్జున ని, బిగ్ బాస్ ని బ్రతిమిలాడి బయటకి వెళ్లిపోతుంటారు. అలా మన తెలుగు బిగ్ బాస్ లో సంపూర్ణేష్ బాబు, గంగవ్వ వంటి వారు వాతావరణం తట్టుకోలేక వెళ్లిపోయారు. గంగవ్వ మళ్ళీ ఈ సీజన్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది, ఆట కూడా దుమ్ము లేపేస్తోంది. ఇది కాసేపు పక్కన పెడితే హిందీ బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కూడా గత ఆదివారం నుండి ప్రారంభం అయ్యింది.

ఈ సీజన్ కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. కౌశల్ టండాన్ అనే వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి వత్తిడి తట్టుకోలేక గోడ దూకి స్టూడియో నుండి పారిపోయాడు. గోడకి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ వైర్లను కూడా ఇతను ఎలా దాటుకుంటున్నాడో మీరే చూడండి. బిగ్ బాస్ అగ్రిమెంట్ ప్రకారం ఇలాంటివి చేస్తే పాతిక లక్షల రూపాయిల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఒప్పంద పత్రం లో చాలా స్పష్టం గా ఉంటుంది, వాటి మీద సంతకం చేసిన తర్వాతనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనిస్తారు. ఇతనెవరో ఆ రూల్స్ ని పాటించకుండా, హాస్టల్ గోడని దూకి వెళ్లినట్టు వెళ్ళాడు. దీనిపై వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ సల్మాన్ ఖాన్ ఏమని సమాధానం చెప్తాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version