https://oktelugu.com/

Rajamouli-Mahesh Babu movie : మహేష్ కి జంటగా హాలీవుడ్ స్టార్ బ్యూటీ, రాజమౌళి మాస్టర్ ప్లాన్!

ఎస్ఎస్ఎంబి 29 రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఏకంగా హాలీవుడ్ స్టార్ క్యాస్ట్ ని ఎంపిక చేస్తున్నాడట. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంటగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించుతున్నాడట. ఈ మేరకు ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్... వివరాలు మీ కోసం

Written By:
  • S Reddy
  • , Updated On : November 23, 2024 / 09:20 PM IST

    Rajamouli-Mahesh Babu movie

    Follow us on

    Rajamouli-Mahesh Babu movie : ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ రేంజ్ కి వెళ్ళాడు రాజమౌళి. ఆయన దర్శకత్వ ప్రతిభను దిగ్గజ దర్శకులు స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి ప్రముఖులు కొనియాడారు. ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈసారి హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ఎస్ఎస్ఎంబి 29 ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మన ఊహకు మించిన స్థాయిలో ఉంటుందనే సమాచారం అందుతుంది.

    ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని యూనివర్సల్ స్టోరీ సిద్ధం చేశారు. జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఎస్ఎస్ఎంబి 29 రూపొందించనున్నారు. ఇటీవల లొకేషన్స్ వేటలో భాగంగా రాజమోళి కెన్యా దేశం వెళ్ళాడు. అక్కడ వైల్డ్ సఫారీ చేశాడు. అడవులను పరిశీలించాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో మహేష్ బాబుకు జంటగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేశాడట.

    అల్లావుద్దీన్, చార్లీస్ ఏంజెల్స్ చిత్రాల్లో నటించిన నవోమి స్కాట్ ఎస్ఎస్ఎంబి 29 చిత్రంలో నటిస్తుందనేది తాజా వార్త. రాజమౌళి ఈ హాలీవుడ్ భామను సంప్రదించగా ఆమె ఓకే చెప్పారట. రెమ్యునరేషన్ సైతం భారీగా ఇస్తున్నారట. నవోమి స్కాట్ నేపథ్యం పరిశీలిస్తే.. ఇంగ్లీష్ ఫాదర్, ఇండియన్ మదర్ కి 1993లో ఆమె జన్మించారు. నవోమి తల్లి పేరు ఉష స్కాట్. ఆమె గుజరాతీ మహిళ. చాలా ఏళ్ల క్రితం ఉగాండా దేశం నుండి బ్రిటన్ కి వలస వచ్చారట.

    నవోమి కెరీర్ బిగింగ్ లో టెలివిజన్ సిరీస్లు చేశారు. అనంతరం 2015లో ది 33 అనే చిత్రంలో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 2014లో ఫుట్ బాల్ ప్లేయర్ జోర్డాన్ స్పెన్స్ ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె రెండు ఇంగ్లీష్ చిత్రాల్లో నటిస్తోంది.