https://oktelugu.com/

Rajamouli : స్టార్ హీరోలకు చెమటలు పట్టించే రాజమౌళికి దడ పుట్టించే ఒకే ఒక హీరో.. ఎవరో తెలుసా?

రాజమౌళితో మూవీ చేసే హీరో ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి. ఎన్నేళ్ల సమయం పట్టినా మధ్యలో మరో మూవీ చేయకూడదు. తనకు కావలసిన అవుట్ ఫుట్ వచ్చే వరకు నటులను హింసిస్తాడట. ఒక పట్టాన సంతృప్తి చెందడు అట. తన సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ. డైరెక్షన్ తో పాటు మార్కెటింగ్, బిజినెస్ కూడా ఆయనే చూసుకుంటాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : November 23, 2024 / 09:35 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. మరి ఆయనతో సినిమా చేసిన హీరో ఫేమ్ మరో రేంజ్ కి వెళుతుంది. అందుకే రాజమౌళి ఛాన్స్ కోసం ఎదురు చూసే హీరోలు ఎందరో ఉన్నారు. ఇండియా వైడ్ ఆయన సినిమా ఆఫర్ ఇస్తే కాదనే హీరో ఉండరేమో. ఆచితూచి సినిమాలు చేసే రాజమౌళి దర్శకుడిగా చేసింది 12 చిత్రాలు మాత్రమే. బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు ఆయన ఒక పదేళ్ల సమయం కేటాయించారు. సగటున మూడేళ్లకు ఒక సినిమా చేశాడు.

    ఇక రాజమౌళితో మూవీ చేసే హీరో ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి. ఎన్నేళ్ల సమయం పట్టినా మధ్యలో మరో మూవీ చేయకూడదు. తనకు కావలసిన అవుట్ ఫుట్ వచ్చే వరకు నటులను హింసిస్తాడట. ఒక పట్టాన సంతృప్తి చెందడు అట. తన సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ. డైరెక్షన్ తో పాటు మార్కెటింగ్, బిజినెస్ కూడా ఆయనే చూసుకుంటాడు. పలు క్రాఫ్ట్స్ పై రాజమౌళికి అవగాహన ఉంది.

    కాగా చేసిన హీరోతోనే రిపీటెడ్ గా సినిమాలు చేసే రాజమౌళి… కొందరు హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. వారిలో బాలకృష్ణ ఒకరు. నందమూరి బాలకృష్ణతో ఎన్టీఆర్ మూవీస్ చేయకపోవడానికి ఒక బలమైన కారణం ఉందట. అదేమిటో ఓ సందర్భంలో రాజమౌళి స్వయంగా వెల్లడించారు. బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ షోకి గతంలో రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. అప్పుడు మన కాంబోలో మూవీ రాలేదు. ఫ్యాన్స్ అడుగుతున్నారు. అయినా.. నువ్వు నన్ను హ్యాండిల్ చేయలేనని చెప్పావట కదా… అని బాలయ్య అడిగారు.

    అందుకు నవ్వేసిన రాజమౌళి.. బేసిక్ గా మీరంటే నాకు భయం. అందుకే మీతో మూవీ చేయలేదు అన్నారు. బాలయ్య ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. పబ్లిక్ లో ఫ్యాన్స్ మీద చేయి చేసుకున్న సందర్భాలు అనేకం. బాలయ్య అంటే ఇండస్ట్రీలో చాలా మందికి భయం ఉంది. వారిలో రాజమౌళి ఒకరు.

    అయితే రాజమౌళి సింహాద్రి చిత్రం బాలకృష్ణతో చేయాలని అనుకున్నాడట. ఆయన్ని కలిశారట కూడా. కారణం తెలియదు కానీ.. బాలకృష్ణ సింహాద్రి స్క్రిప్ట్ రిజెక్ట్ చేశాడు. అది రాజమౌళికి రెండో చిత్రం. బహుశా కొత్త దర్శకుడు అని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. లేదా ఇతర కమిట్మెంట్స్ కారణంగా వదులుకున్నారేమో. బాలయ్య చేయను అనడంతో ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ వద్దకు వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్లో సింహాద్రి అతిపెద్ద హిట్. ఇండస్ట్రీ రికార్డ్స్ తుడిచిపెట్టిన చిత్రం అది. ఎన్టీఆర్ ఆ చిత్రంతో స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. ఆయన ఇమేజ్ ని రెండింతలు చేసిన చిత్రం సింహాద్రి.