Hit 3 and Squid Games : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case) పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేసింది. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు చాలానే ఉన్నాయని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది కానీ, హీరో ఎందుకు అంత హింస చేసాడు అనేదానికి కారణాలు కూడా చాలా బలంగా ఉంటాయని నిన్న హీరో నాని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ట్రైలర్ లో పసిబిడ్డపై విలన్స్ కత్తి పెట్టినప్పుడు, వాళ్ళ పట్ల ఎంతటి హింసాత్మక ధోరణితో ప్రవర్తించినా తప్పు లేదని అనిపించింది అంటూ ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నిన్న మీడియా సమావేశం లో చెప్పుకొచ్చాడు. అయితే ‘హిట్ 3’ ఏమిటి?, రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలాగానే ఉంటుందా?, లేకపోతే కొత్తదనం జొప్పించారా? అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.
Also Read : 24 గంటల్లో ‘హిట్ 3’ ట్రైలర్ భీభత్సం..అన్ని రికార్డ్స్ స్మాష్!
నెట్ ఫ్లిక్స్ లో మనమంతా ‘స్క్విడ్ గేమ్స్'(Squid Games) అనే పాపులర్ కొరియన్ వెబ్ సిరీస్ ని చూసే ఉంటాము. రెండు సీజన్స్ వచ్చాయి, రెండు కూడా పెద్ద హిట్ అయ్యాయి. స్టోరీ ఏమిటంటే జీవితంలో ఎన్నో ఆర్ధిక కష్టాలు ఉన్న మధ్య తరగతి కుటుంబానికి చెందిన మనుషుల బలహీనతలను గమనించి, వాళ్లకు డబ్బు ఎరగా వేసి, ఎవరికీ తెలియని ఒక సముద్రపు దీవికి తీసుకెళ్లి గేమ్స్ ఆడిస్తారు. ఆ గేమ్స్ లో గెలిచిన వాళ్లకు అంతులేని సంపద, జీవితం మొత్తం మరో పని చేసుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. జీవితాంతం లావిష్ గా బ్రతికేంత డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఈ గేమ్ లో ఉన్న నియమం ఏమిటంటే ఓడిపోయిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం, అంటే చంపేయడం అన్నమాట. వందలాది మంది గేమ్స్ ఆడేందుకు వస్తే, కేవలం ఒక్కడే డబ్బులతో ప్రాణాలతో బయటపడుతాడు.
ఈ వెబ్ సిరీస్ ని ఆధారంగా తీసుకొని ‘హిట్ 3’ స్టోరీ ని డిజైన్ చేసారు అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. నిస్సహాయత తో ఉండే కొంతమందిని తీసుకెళ్లి, గేమ్ ఆడించి వాళ్ళని చంపేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. హీరో ఇవన్నీ గమనించి ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ క్రిమినల్స్ ఆటలను ఎలా అరికట్టించాడు అనేదే స్టోరీ. ఇదే లైన్ మీద సినిమా ఉంటుంది అని కచ్చితంగా అయితే చెప్పలేము కానీ, ట్రైలర్ ని చూసిన తర్వాత అదే అనిపిస్తుంది. హీరో నాని ఒక లేడీ విలన్ తో బాక్సింగ్ చేసే షాట్ ని మీరంతా గమనించే ఉంటారు. దానిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నిస్సహాయత తో ఉండే వాళ్ళను ఒక రహస్య స్థావరంలోకి తీసుకొచ్చి, పలు రకాల గేమ్స్ ని ఆడించి వాళ్ళని హతమార్చే శాడిస్టుల భరతం పట్టే పాత్రలో హీరో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. మరి స్టోరీ అదేనా కాదా అనేది తెలియాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందే.