Squid Games : కరోనా లాక్ డౌన్ సమయం లో మన తెలుగు ఆడియన్స్ ఓటీటీ కి బాగా అలవాటు పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటీటీ లో ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలకు సంబంధించిన వెబ్ సిరీస్లు, సినిమాలను చూసారు. అలా మన తెలుగు ఆడియన్స్ ఇరగబడి చూసిన వెబ్ సిరీస్ లలో ఒకటి కొరియన్ దేశానికి సంబంధించిన ‘స్క్విడ్ గేమ్స్’. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో సంచలన విజయం సాధించింది. డబ్బులు భారీ గా సంపాదించుకోవాలనే ఆశతో, ఈ గేమ్స్ ఆడేందుకు ముందుకు వస్తారు జనాలు. అయితే ఈ గేమ్స్ సాధారణమైన గేమ్స్ లాగా ఉంటుందని భ్రమపడి వెళ్లిన జనాలకు అక్కడ ఊహించని పరిణామాలు ఎదురు అవుతాయి. లెవెల్స్ వారీగా ఉండే ఈ గేమ్స్ లో ఓడిపోయిన వాళ్ళని చంపేస్తూ ఉంటారు అక్కడి నిర్వాహకులు. అలా అందరూ చనిపోయాక చివరగా ఎవరైతే మిగులుతారో, వాళ్లకు భారీ ఎత్తున ప్రైజ్ మనీ ని ఇచ్చి పంపుతారు.
ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ మరో రెండు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులో రానుంది. ఇది ఇలా ఉండగా ఈ వెబ్ సిరీస్ ని సినిమా రూపం లోకి తీసుకొచ్చేందుకు ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ నటించబోతున్నట్టు సమాచారం. తెలుగు లో కూడా ఈ చిత్రాన్ని దబ్ చేస్తారట. ఇప్పటికే వెబ్ సిరీస్ ని ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఇరగబడి చూసేసారు కదా, ఇప్పుడు ఈ సినిమాని చూస్తారా అనే సందేహం కొందరిలో ఉంది. అయితే కేవలం ఆ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ని మాత్రమే తీసుకుంటున్నారని, వెబ్ సిరీస్ లో కనిపించే గేమ్స్ సినిమాలో ఉండవని, ఇలాంటివి ఎన్ని కాన్సెప్ట్స్ వచ్చినా ఆడియన్స్ ఆసక్తిగా చూస్తారని ఆ నిర్మాత బలంగా నమ్ముతున్నాడట. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు వంటి విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఈ సీజన్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడకుంటే వెంటనే నెట్ ఫ్లిక్స్ లోకి వెళ్లి చూడండి. మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు సీజన్ మొత్తం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని చూస్తే మన తెలుగు సినిమాలే గుర్తుకు వస్తాయి. అంత చక్కగా తీసాడు డైరెక్టర్. రెండవ సీజన్ లో హీరో మళ్ళీ ఈ గేమ్స్ ఆడేందుకు వస్తాడు. ఈ గేమ్స్ ని నిర్వహిస్తున్న వాళ్ళ ఆటలను అరికట్టి, మోసపోయే జనాలను కాపాడేందుకు మరోసారి రిస్క్ చేస్తాడు. మరి హీరో చేసిన ఈ రిస్క్ లో విజయం సాధిస్తాడా లేదా అనేది చూడాలి. మొదటి సీజన్ లో ఉండే గేమ్స్, రెండవ సీజన్ లో కూడా ఉంటాయి. ఈ సీజన్ కి సంబంధించిన ట్రైలర్ ని మీరు యూట్యూబ్ లో చూడొచ్చు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Are you going to make the squid games series into a movie in telugu with that hero you will be surprised to see the complete details
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com