Homeఎంటర్టైన్మెంట్Nani Sujith movie: నాని, సుజిత్ మూవీ లో పూజ హెగ్డే..రికార్డు స్థాయి రెమ్యూనరేషన్..ఎవ్వరూ ఊహించనిది...

Nani Sujith movie: నాని, సుజిత్ మూవీ లో పూజ హెగ్డే..రికార్డు స్థాయి రెమ్యూనరేషన్..ఎవ్వరూ ఊహించనిది ఇది!

Nani Sujith movie: పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే(Pooja Hegde). ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈమె ఒక సంచలనం. అతి తక్కువ సినిమాలతోనే నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. చివరిసారిగా ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి కనిపించిన చిత్రం ‘ఆచార్య’. ఆ సినిమా తర్వాత ‘F3’ లో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించగా, […]

Nani Sujith movie: పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే(Pooja Hegde). ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈమె ఒక సంచలనం. అతి తక్కువ సినిమాలతోనే నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. చివరిసారిగా ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి కనిపించిన చిత్రం ‘ఆచార్య’. ఆ సినిమా తర్వాత ‘F3’ లో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించగా, గత ఏడాది విడుదలైన రెట్రో, కూలీ వంటి తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా మన ఆడియన్స్ ని పలకరించింది. అంతే కానీ డైరెక్ట్ తెలుగు సినిమాలో ఆమె నటించి దాదాపుగా నాలుగేళ్లు కావొస్తుంది. ఇంత పెద్ద సుదీర్ఘ విరామం తర్వాత రీసెంట్ గా ఆమె ఒక డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆ సినిమా మరేదో కాదు, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్ననాని(Natural star Nani), సుజీత్(Sujeeth) ‘బ్లడీ రోమియో’ మూవీ అన్నమాట. ఈ చిత్రం లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కానీ ఈ సినిమాలో నటించడం కోసం ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?, అక్షరాలా 8 కోట్ల రూపాయిలు. ఈ రేంజ్ లో సౌత్ ఇండియా లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదు. బహుశా అందుకేనేమో పూజా హెగ్డే తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. సౌత్ ఇండియా నుండి నార్త్ ఇండియా కి షిఫ్ట్ అయినా పూజ హెగ్డే, అక్కడ ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ వచ్చింది. బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి, అక్కడి నిర్మాతలకు అంత మొత్తం రెమ్యూనరేషన్ ఇవ్వడం లో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.

కానీ సౌత్ లో ఆ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే ఏ నిర్మాత సాహసం చేయడు. కానీ నాని, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ‘బ్లడీ రోమియో’ చిత్రానికి పూజా హెగ్డే మాత్రమే హీరోయిన్ గా సూట్ అవుతుందట. ఆమె కోసమే అన్నట్టుగా ఆ పాత్రని రాసుకున్నాడట డైరెక్టర్ సుజిత్. అందుకే ఆమె డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. జూన్ నెల నుండి ఈ చిత్రం మొదలు కానుంది. ఈ ఏడాది ఎండింగ్ లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రం తర్వాత సుజిత్ ‘ఓజీ 2’ చేయబోతున్నాడు. మరి చాలా కాలం తర్వాత రీ 1ఎంట్రీ ఇవ్వబోతున్న పూజ హెగ్డే ని మన తెలుగు ఆడియన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper