Hit 3 Trailer : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్'(Hit : The Third Case) మే 1న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు సూపర్ హిట్స్, అది కూడా కాకుండా ‘హిట్’ ఫ్రాంచైజ్ నుండి తెరకెక్కిన సినిమా కావడం తో అంచనాలు షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుండే భారీ రేంజ్ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్ ఉండడంతో అభిమానులు ఈ చిత్రం కచ్చితంగా నాని కెరీర్ లో నెంబర్ 1 గా నిలుస్తుందని అనుకున్నారు. నిన్న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగేలా చేసింది. టాలీవుడ్ లో ఇలాంటి యాక్షన్ చిత్రాన్ని ఎప్పుడూ చూడలేదని, సినిమాలో సరైన ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈ యాక్షన్ సీన్స్ అనుసరించి ఉండుంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : ‘నా సినిమాకి మీలాంటోళ్ళు రాకూడదు’ అంటూ హీరో నాని కామెంట్స్!
థియేటర్స్ విడుదలైన తర్వాత ఎలా ఉంటుంది అనేది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రం ట్రైలర్ తోనే ఎన్నో సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పింది. ముఖ్యంగా వ్యూస్ విషయంలో మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీలో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ కి 24 గంటల్లో 21 లక్షలకు పైగా వ్యూస్, నాలుగు లక్షల 22 వేల లైక్స్ వచ్చాయి. ఈ చిత్రానికి ముందు వరకు విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘లైగర్’ చిత్రం 16 మిలియన్లకు పైగా వ్యూస్ తో నెంబర్ 1 స్థానంలో ఉండేది. ఆ రికార్డు ని ‘హిట్ 3’ చిత్రం బ్రేక్ చేసింది. కానీ లైక్స్ విషయం లో మాత్రం ‘లైగర్’ రికార్డ్స్ ని అందుకోలేకపోయింది ఈ చిత్రం. లైగర్ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 5 లక్షల 61 లైక్స్ వచ్చాయి.
ఇక మిగిలిన మీడియం రేంజ్ హీరోల థియేట్రికల్ ట్రైలర్స్ కి 24 గంటల్లో 15 మిలియన్ వ్యూస్ కూడా రాకపోవడం గమనార్హం. రామ్ నటించిన స్కంద, నితిన్ నటించిన ‘మాచెర్ల నియోజకవర్గం’ సినిమాల ట్రైలర్స్ ఈ రెండు సినిమా ట్రైలర్స్ తర్వాతి స్థానం లో నిలిచాయి. ఇకపోతే నాని ‘హిట్ 3’ కి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ లో నాని మీడియం రేంజ్, టాప్ రేంజ్ హీరోలు అని విభజించి మాట్లాడే విలేకరులపై మండిపడ్డారు. ఈ కాన్సెప్ట్ కేవలం మీరు తెచ్చింది మాత్రమే, టాలీవుడ్ లో అలాంటివి ఏమి లేవు, సినిమా బాగుంటే ఎవరైనా ఒక్కటే ఇక్కడ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : హిట్ 3 ట్రైలర్ : నాని వయోలెన్స్ లో పి హెచ్ డి చేసినట్టు ఉన్నాడుగా…