Hit 3 : మీడియం రేంజ్ హీరోలలో ఓవర్సీస్ లో బలమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈయన నటించిన ప్రతీ సినిమా నార్త్ అమెరికా లో 1 మిలియన్ డాలర్ మార్కుని అవలీలగా అందుకునేవి. ఇక ఆయన గత చిత్రం ‘సరిపోదా శనివారం’ అయితే కేవలం నార్త్ అమెరికా దేశం నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇదంతా చూస్తుంటే ఓవర్సీస్ మార్కెట్ లో నాని స్టార్ హీరో స్థాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు. అందుకే ‘హిట్ 3′(Hit : The Third Case) ఓవర్సీస్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 10 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. ఆ బిజినెస్ కి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి ఇప్పటి వరకు ఈ సినిమాకు 2,68,000 కు పైగా అమెరికన్ డాలర్స్ వచ్చాయి. కాసేపట్లో మూడు లక్షల గ్రాస్ మార్కుని అందుకోనుంది. ‘సరిపోదా శనివారం’ చిత్రానికి ఇదే సమయం లో రెండు లక్షల డాలర్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు భారీ మార్జిన్ తో ఆ మూవీ రికార్డు ని బద్దలు కొట్టింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ నాలుగు లక్షల డాలర్లు వరకు ఉండే అవకాశం ఉందని, ఓవరాల్ ప్రీమియర్ షోస్ ముగిసే సమయానికి ఈ చిత్రం కచ్చితంగా 7 లక్షల డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రీమియర్ షోస్+ మొదటి రోజు కలిపి 1 మిలియన్ డాలర్ రాబడుతుందని, టాక్ వస్తే నాని ఖాతాలో మరో 3 మిలియన్ డాలర్ చిత్రం గా నిలుస్తుందని అంటున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. బుక్ మై షో యాప్ ద్వారా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 88 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ‘సరిపోదా శనివారం’ చిత్రానికి ఇదే సమయానికి బుక్ మై షో యాప్ లో 48 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ‘హిట్ 3’ కి దానికంటే రెండింతలు ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోవడం గమనార్హం. ఊపు చూస్తుంటే మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా కచ్చితంగా 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చేలా ఉంది. ఈ చిత్రానికే ఈ రేంజ్ ర్యాంపేజ్ ఉంటే, ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటి నుండే ఊహించుకోండి. నాని కూడా ఆ సినిమాతో మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన హీరోల జాబితాలోకి చేరిపోతాడు అనుకోవచ్చు.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?