Retro : కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో సూర్య(Suriya Sivakumar), పూజా హెగ్డే(Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఈ చిత్రం హైప్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఏర్పడింది. ‘కంగువ’ చిత్రానికి కూడా జరగనుంది అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమాకు తమిళనాడు లో జరుగుతుంది. పైగా మే1 కార్మికుల దినోత్సవం అవ్వడంతో ఈ చిత్రం ఓపెనింగ్స్ కి మరింత కలిసొచ్చే అంశం. తమిళనాడు ట్రేడ్ అయితే బుకింగ్స్ ని చూసి ఆశ్చర్యానికి గురైంది. అజిత్, విజయ్, రజినీకాంత్ సినిమాలకు మాత్రమే ఇది వరకు ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగేవి. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సూర్య కూడా చేరిపోయాడు. ప్రస్తుతం నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమాకు మొదటి రోజు కేవలం తమిళనాడు నుండే 20 కోట్ల గ్రాస్ వచ్చేలా ఉంది.
Also Read : రెట్రో’ ని డబుల్ మార్జిన్ తో డామినేట్ చేస్తున్న ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్!
ఆదివారం రోజున అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, ఇప్పటి వరకు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా దాదాపుగా రెండు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కేవలం చెన్నై సిటీ నుండే ఈ చిత్రానికి కోటి 47 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయట. అదే విధంగా కేరళలో 575 షోస్ ని ఇప్పటి వరకు షెడ్యూల్ చేయగా, 37,701 టికెట్స్ అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 62 లక్షల రూపాయిలు వచ్చాయి. ఇక కర్ణాటక లో అయితే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 37 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చిందట. ఓవరాల్ గా తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి బుకింగ్స్ ద్వారా నాలుగు కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఫైనల్ అడ్వాన్స్ సేల్స్ 20 కోట్లకు చేరొచ్చని, టాక్ వస్తే మొదటి రోజు 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సూర్య ‘కంగువ’ చిత్రానికి ఫ్లాప్ టాక్ కారణంగా కేవలం 40 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే మొదటి రోజు వచ్చాయి. ఇకపోతే తెలుగు వెర్షన్ వసూళ్లు కాస్త అందుకుంటే ఓపెనింగ్స్ ఇంకా భారీ గా ఉండే అవకాశం ఉంది. కానీ తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినంతగా లేవు. ఆడియన్స్ అందరు హిట్ 3 మేనియా లోనే ఉన్నారు. కానీ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా తెలుగు వెర్షన్ వసూళ్లు కూడా చాలా బలంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. రీసెంట్ గానే తెలుగు లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే, విజయ్ దేవరకొండ ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు.
Also Read : రెట్రో’ చిత్రాన్ని మిస్ చేసుకున్న సూపర్ స్టార్ అతనేనా..?