Hit 3 : న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలన్ (shailesh Kolen) దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 (Hit 3) సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఈ సినిమాతో అతనికి కంప్లీట్ గా మాస్ హీరోగా గుర్తింపైతే వచ్చింది. ఇంతకుముందు దసర (Dasara) సినిమాతో మాస్ హీరోగా అవతరించిన నాని ఈ సినిమాతో తనలోని వైలెన్స్ మొత్తాన్ని బయటికి తీసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో నాని మాస్ హీరోగా ప్రేక్షకులకు దగ్గరవ్వబోతున్నాడు అంటూ విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో చేయబోతున్న ప్యారడైజ్ (Paradaise)సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఎలాగైనా సరే తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో నాని ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన మార్కును చూపించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నాని ఎప్పుడైతే మాస్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడో అప్పటినుంచి వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనకు మంచి దర్శకులు దొరకడం, మంచి కథలతో వాళ్లు నాని ని అప్రోచ్ అవడం అన్ని చకచక జరిగిపోతున్నాయి.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ నాని హిట్ 3 సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకున్నప్పటికి అందులో ఏమాత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే లేవని, హిట్ మొదటి పార్ట్ తో పోలిస్తే హిట్ 3 సినిమా కథపరంగా చాలా వీక్ గా ఉందని మరి కొంతమంది అంటున్నారు. అలాగే కేవలం వైలెన్స్ కోసమే ఈ సినిమాని చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. నాని ఇలా చేయడం ఏంటి అని మరి కొంతమంది అతన్ని విమర్శిస్తున్నారు…
ఒకప్పుడు నాని అంటే మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు అంటూ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అతన్ని మెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన వరుసగా మాస్ సినిమాలు చేయడం పట్ల కొంతమంది కొంతవరకు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తన అభిమానులమని చెప్పుకుంటున్న చాలామంది మాస్ సినిమాలు చేస్తున్న నాని ని చూసి మా హీరో ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
మరి ఎవరు ఏమనుకున్నా కూడా నాని మాత్రం తనని తాను స్టార్ హీరోగా చూసుకోవాలనే ఒక కోరికతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి స్టార్ హీరోగా మారాలి అంటే మాస్ సినిమాలు చేయాల్సిందే. సాఫ్ట్ సినిమాలు ఎన్ని చేసినా కూడా మాస్ హీరోకి ఉన్న ఇమేజ్ సాఫ్ట్ సినిమాలు చేసే హీరో కైతే రాదు అందువల్లే నాని మాస్ జపం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?