Anushka : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి అనుష్క లాంటి హీరోయిన్ మాత్రం తనకొచ్చిన క్రేజ్ ను వాడుకోవడంలో కూడా చాలా వరకు వెనుకబడి పోతున్నారనే చెప్పాలి. బాహుబలి2 సినిమాతో ఎవ్వరికి రానటువంటి గుర్తింపును సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలను చేయడంలో వెనుకబడి పోయారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో స్టార్ హీరోయిన్లు సైతం వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాళ్ళ క్రేజ్ ను పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ సైతం ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతుంది. ఒకప్పుడు ఆమె ‘అరుందతి’ (Arundathi) లాంటి సినిమాతో మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోలకు తగ్గట్టుగా మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంది. అంతటి గొప్ప గుర్తింపును సంపాదించుకొని ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె వరుస సినిమాలను చేయడంలో కొంతవరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి. బాహుబలి (Bahubali) సినిమా తర్వాత నుంచి ఆమె జోరు అంతకంతకు తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం ఆమె క్రిష్ (Krish) డైరెక్షన్ లో ‘ఘాటి’ (Ghati) అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాను మినహాయిస్తే ఇంకే సినిమాకి ఆమె కమిట్ అయితే అవ్వలేదు. ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అనుష్క (Anushka) ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూస్తుంది అని ప్రతి ఒక్కరు తీవ్రమైన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుష్క ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆమె చాలా లావు అయిపోయింది. దానివల్ల ఇండస్ట్రీలో ఆమెకు తగ్గ పాత్రలు రావడం లేదు.
ఇక ఆమె కూడా పెద్దగా సినిమాలు చేయాలనే ఆలోచనలో లేదు. అందువల్ల తమకు వచ్చిన క్యారెక్టర్ లను మాత్రమే చేస్తుంది తప్ప ప్రత్యేకించి ఈ క్యారెక్టర్లు చేయాలని ఆమె డిమాండ్ అయితే చేయడం లేదు. అందువల్లే ఆమె కొంతవరకు వెనుకబడిపోయింది. తన తోటి హీరోయిన్లందరూ మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే ఆమె మాత్రం కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు.
బాహుబలి 2 (Bahubali 2) సినిమాతో భారీ ఇమేజ్ ను సంపాదించుకున్న ఆమె ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడంలో మాత్రం కొంతవరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి. మరి ఇప్పటికైనా ఆమె స్టార్ హీరోయిన్ గా మరోసారి తన సత్తాను చాటుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఘాటీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!