Vennela Kishore: తెలుగు సినిమాల్లో కామెడీ ప్రధానంగా నిలుస్తుంది. కొందరు కమెడియన్లతోనే సినిమా సక్సెస్ అయినవి ఉన్నాయి. అయితే నేటి కాలంలో సినిమాలో కామెడీ అంతరించిపోతుంది. ఈ పరిస్థితిలో కొందరు కమెడియన్లు మళ్లీ తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాటి నుంచి నేటి వరకు తన కామెడీతో ఆకట్టుకుంటున్న వెన్నెల కిషోర్ నటుడిగా, డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆనంద బ్రహ్మ అయినా బ్రహ్మానందంతోనే మూవీ తీసి ప్రత్యేకంగా నిలిచాడు. తాజాగా వెన్నెల కిషోర్ ‘సింగిల్’అనే మూవీలో నటించారు. ఇందులో శ్రీ విష్ణు హీరోగా ఉన్నారు. ఆయనతో చేసిన కిషోర్ అల్లరి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ డైరెక్షన్ పై షాకింగ్ కామెంట్ చేశారు.. అదేంటంటే?
Also Read: ‘దేశముదురు’ థియేటర్ లో అల్లు అర్జున్, పవన్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ..వీడియో వైరల్!
‘ వెన్నెల’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కిషోర్.. ఆ సినిమా పేరు నే ఇంటిపేరుగా మార్చుకొని గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నా.. వెన్నెల కిషోర్ కు స్పెషల్ గుర్తింపు వచ్చింది. అయితే కామెడీతో ఆకట్టుకున్న ఈయన రైటర్ గాను సుప్రసిద్ధుడు. ఈ క్రమంలో బ్రహ్మానందంతో కలిసి ఆయన తీసిన జఫ్ఫా అనే మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అయినా వెనక్కి తగ్గకుండా వెన్నెల వన్ అండ్ ఆఫ్ అనే మూవీని తీశారు. ఇది కూడా సక్సెస్ను అందుకోలేకపోయింది. దీంతో అప్పటినుంచి ఆయన సినిమాలకు డైరెక్షన్ చేయడం తగ్గించారు. అయితే అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం, ఆలీ కంటే వెన్నెల కిషోర్ ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు.
తాజాగా వెన్నెల కిషోర్ సింగిల్ అనే సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసినా కొన్ని కామెంట్లు వైరల్ గా మారాయి. గతంలో కొన్ని సినిమాలకు డైరెక్షన్ వహించిన నేపథ్యంలో.. కొందరు వెన్నెల కిషోర్ ను.. మళ్లీ ఎప్పుడు సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు? అని అడిగారు. దీంతో ఆయన షాకింగ్ సమాధానం చెప్పారు. తాను ఇప్పట్లో డైరెక్షన్ చేసే ఆలోచన లేదని.. మరోసారి డైరెక్షన్ చేసే ఓపిక కూడా లేదని… ఇక మోకాలు పట్టేసి నేనింకా నడవలేను అని అనుకుంటున్న సమయంలో మంచి రైటర్ ను పెట్టుకొని డైరెక్షన్ చేస్తా.. అని వెన్నెల కిషోర్ చెప్పారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నానని.. ఇప్పుడు డైరెక్షన్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
దీంతో వెన్నెల కిషోర్ ప్రస్తుతం డైరెక్టర్గా మారే అవకాశం లేదని తెలుస్తోంది. గతంలో ఎంతో మంది నటులు డైరెక్టర్గా చేయబోయి చేతులు కాల్చుకున్నారు. వెన్నెల కిషోర్ కూడా డైరెక్షన్ గా రాణించలేకపోయారు. దీంతో ఆయన ఆ వింగుపై వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వెన్నెల కిషోర్ బిజీగా ఉంటున్నారు. చేతినిండా అవకాశాలతో ఉన్న ఆయన దాదాపు అన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. అంతేకాకుండా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.