Hit 3 Movie: వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటిస్తున్న చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్'(Hit :The Third Case). శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని వచ్చే నెల 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను నేడు పూర్తి చేశారు. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ని జారీ చేశారు. ఈ చిత్రంలోని హింసాత్మక సన్నివేశాలను చూసి సెన్సార్ బోర్డు సభ్యులు మూవీ టీం కి గట్టి వార్నింగ్ ఇచ్చారట. ఇటీవలే మలయాళం లో ‘మార్కో’ అనే చిత్రం వచ్చింది, ఆ సినిమా థియేటర్స్ లో ఆడినన్ని రోజులు అందరూ ఎంజాయ్ చేశారు, కానీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాని అసలు సెన్సార్ సభ్యులు ఎలా అంగీకరించారు అంటూ విమర్శకుల నుండి కామెంట్స్ ఎదురయ్యాయి.
Also Read: మళ్ళీ బిజీ అయిపోయిన హీరోయిన్ కృతి శెట్టి..చేతినిండా సినిమాలే!
ప్రభుత్వం కూడా దీనిని చాలా సీరియస్ గా తీసుకొని సాటిలైట్ టెలికాస్ట్ ని ఆపేసింది. ఇప్పుడు ‘హిట్ 3’ విడుదల తర్వాత ఎలాంటి వివాదాలు రాజపోతే ఓకే, ఒకవేళ వస్తే మాత్రం సెన్సార్ బోర్డు నుండి కఠినమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చాయట. అప్పటికీ వాళ్ళ పరిధి మేర అనేక సన్నివేశలను కట్ చేశారట. కొన్ని సన్నివేశాలకు బ్లర్ పెట్టగా, మరికొన్ని సన్నివేశాలను మ్యూట్ చేశారు. సెన్సార్ రివ్యూ ని ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది టాలీవుడ్ ‘మార్కో’ అని అంటున్నారు. సినిమా బాగానే ఉంది, యూత్ ఆడియన్స్ ఎగబడి చూసే అవకాశాలు ఉన్నాయి, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ఉన్న నాని, ఈ ఒక్క సినిమా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరంగా ఉండాల్సిందే అని అంటున్నారు. వాళ్ళు థియేటర్స్ వైపు కూడా చూసే అవకాశాలు లేవట, పోరాట సన్నివేశాలు ఆ రేంజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.
టీజర్ ని చూసినప్పుడే మన అందరికీ ఈ చిత్రం గురించి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను టీజర్ లో చూపించింది కేవలం ఒక్క శాతం మాత్రమే, సినిమాలో అలాంటివి ప్రతీ పది నిమిషాలకు ఒకటి ఉంటుందట. మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ తో ఆడియన్స్ కి మరికొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో తమిళ హీరో కార్తీ కనిపించబోతున్నాడు. ‘హిట్ 4’ లో హీరో ఆయనేనట. ఈ విషయం లీక్ అయ్యినందుకు డైరెక్టర్ శైలేష్ కొలను సోషల్ మీడియా వేదికగా చాలా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలో ‘హిట్ 3’ హీరో అడవి శేష్ కూడా ఒక కీలక పాత్ర పోషించాడట.