https://oktelugu.com/

Nayakudu Re Release: కమల్ హాసన్ ఆ ఎవర్ గ్రీన్ సినిమాని రీ రిలీజ్ చేయాలంటున్న ఫ్యాన్స్

ముఖ్యంగా తెలుగులో చాలామంది అభిమానులు ఉన్న కమల్ హాసన్ సినిమాలు ఇక్కడ సూపర్ గా ఆడుతాయి. కమల్ హాసన్ మంచి నటుడు అనడానికి ఈ సినిమాని కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Written By:
  • Gopi
  • , Updated On : September 22, 2023 / 05:50 PM IST

    Nayakudu Re-Release

    Follow us on

    Nayakudu Re-Release: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో కమల్ హాసన్ ఒకరు. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి. ఈయన ఏ క్యారెక్టర్ లో అయినా పరకాయ ప్రవేశం చేసి నటించి మెప్పించగలరు అందుకే ఇండియా లో ఉన్న నటుల అందరి లో కమలహాసన్ ముందు వరుసలో ఉంటాడు. ఒక క్యారెక్టర్ కోసం తను ఎలా చేంజ్ అవ్వమంటే అలా తన బాడీని చేంజ్ చేస్తూ ఇండస్ట్రీలో ఎవరికి దక్కని విధంగా అద్భుతంగా నటించి మెప్పిచగల సత్తా ఉన్న నటుడు. ఇక అందులో భాగంగానే దశావతారం అనే సినిమాలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 క్యారెక్టర్లు తనే పోషించి సినిమా అంటే తనకు ఎంత పిచ్చో మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక ఈయన మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన నాయకుడు సినిమాలో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా లో నటించినందుకు గాను ఈయన కి చాలా అవార్డులు వచ్చాయి. అయితే ఆ సినిమాలో ఈయన ఒక మాఫియా డాన్ గా కనిపిస్తాడు.ఆయన అలా మారడానికి గల కారణాలను కూడా డైరెక్టర్ ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. అయితే ఇప్పుడు నాయకుడు సినిమాని రీ రిలీజ్ చేయాలంటూ అతని అభిమానులు కోరుకుంటున్నారు.

    ముఖ్యంగా తెలుగులో చాలామంది అభిమానులు ఉన్న కమల్ హాసన్ సినిమాలు ఇక్కడ సూపర్ గా ఆడుతాయి. కమల్ హాసన్ మంచి నటుడు అనడానికి ఈ సినిమాని కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆయన నటించిన ఆ నటన ముందు ఇండియా లో ఉన్నఏ ఒక్క నటుడు కూడా పనికిరాడు అనే చెప్పాలి. అంత మంచి నటుడు అయిన కమలహాసన్ ప్రస్తుతం కొంచెం టైం తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన విక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టిన కమలహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్నకల్కి సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ లన్ని కూడా సినిమా యూనిట్ ప్రేక్షకులకు అందించడం జరుగుతుంది. అయితే కల్కి సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నప్పటికీ ఈ సినిమాలో కమలహాసన్ పాత్ర కూడా చాలా హైలెట్ గా ఉంటుందని దర్శకుడు ఇప్పటికే చెప్పాడు…ఇక దింతో పాటు గా శంకర్ డైరెక్షన్ ఇండియన్ 2 సినిమా కూడా వస్తుంది…