Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాత్మక వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలుగు, తమిళం వెర్షన్స్ కంటే ఈ చిత్రానికి హిందీ లోనే భారీ వసూళ్లు వస్తున్నాయి. ఈ వీకెండ్ తో ఈ చిత్రం కచ్చితంగా బాలీవుడ్ లో 700 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టబోతుంది. అలాంటి చిత్రానికి బాలీవుడ్ ట్రేడ్ అన్యాయం చేయబోతుందా?, అల్లు అర్జున్ సృష్టిస్తున్న సునామి ని చూసి వారిలో అసూయ కలిగిందా..?, 14వ రోజు, 15వ రోజు కూడా 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతూ సంచలనం సృష్టిస్తున్న ఒక సినిమాని థియేటర్స్ నుండి తీసేయాలి అనే ఆలోచన వ్యాపారం చేసేవాళ్లకు ఎలా వస్తుంది?, కానీ ‘పుష్ప 2’ విషయంలో అలాగే ప్రవర్తిస్తున్నారు అక్కడి PVR థియేటర్స్ యాజమాన్యం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నెల 25 వ తేదీన వరుణ్ ధావన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బేబీ జాన్’ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తమిళ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్ లో వచ్చిన ‘తేరి’ చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో ఈ సినిమా ‘పోలీసోడు’ పేరుతో దబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నిర్మాణం లో PVR సంస్థ కూడా పెట్టుబడులు పెట్టింది. అందుకే తమ సంస్థ నుండి విడుదలయ్యే సినిమాకి భారీ వసూళ్లు రావాలి అనే ఉద్దేశ్యంతో ‘పుష్ప 2’ చిత్రాన్ని తమ థియేటర్స్ నుండి ఈ నెల 25 వ తేదీ నుండి పూర్తిగా తొలగించేసారు. క్రిస్మస్ కి దేశవ్యాప్తంగా ఆడుతున్న సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. ఇక పుష్ప 2 గురించి అయితే చెప్పక్కర్లేదు.
కేవలం క్రిస్మస్ రోజే ఆ సినిమాకి 50 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నారు PVR సంస్థ. కనీసం తమ థియేటర్స్ లో 50 అయితే పుష్ప 2 కి కేటాయించాల్సింది. అమాంతం అన్ని థియేటర్స్ లో ఈ చిత్రాన్ని తీసి వెయ్యడం అంటే స్వార్థం కంటే ఎక్కువగా అసూయ కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి రావాల్సిన వసూళ్లు, లాభాలు వచ్చేసాయి, ఇక ఈ చిత్రం తో మనకి పని లేదు అనే విధంగా PVR సంస్థ యజమాని ప్రవర్తించాడు. ఇండియా వైడ్ గా ఈ చిత్రం కేవలం PVR , ఐనాక్స్ స్క్రీన్స్ నుండి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పుష్ప 2 కారణంగా PVR సంస్థలకు స్టాక్ మార్కెట్స్ కూడా బాగా పెరిగాయి. అలాంటి సినిమాని థియేటర్స్ నుండి తొలగించడం మూర్ఖపు చర్య అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.